Telugu Global
Cinema & Entertainment

ఈసారి సునీల్ ను ఆదుకునేది థర్టీ ఇయర్స్ ఫృధ్వీనే....

ఒకప్పుడు బ్రహ్మానందం సినిమాను నడిపించేవాడు. బ్రహ్మి కామెడీ పండిందంటే సినిమా పంట పండినట్టే. స్టార్ హీరో, మీడియా రేంజ్ హీరో అనే తేడా లేకుండా తన అప్పీయరెన్స్ తో టోటల్ సినిమా జాతకాన్నే మార్చేసేవాడు బ్రహ్మి. ఆయన పంచ్ లుంటే సినిమా సగం హిట్ అనే టాక్ ఉండేది అప్పట్లో. ప్రస్తుతం ఆ స్టార్ కమెడియన్ హవా నడవట్లేదు. అది వేరే సంగతి., ఇప్పుడు ఆ అదృష్టం మరో హాస్యనటుడికి పట్టింది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే […]

ఈసారి సునీల్ ను ఆదుకునేది థర్టీ ఇయర్స్ ఫృధ్వీనే....
X

ఒకప్పుడు బ్రహ్మానందం సినిమాను నడిపించేవాడు. బ్రహ్మి కామెడీ పండిందంటే సినిమా పంట పండినట్టే. స్టార్ హీరో, మీడియా రేంజ్ హీరో అనే తేడా లేకుండా తన అప్పీయరెన్స్ తో టోటల్ సినిమా జాతకాన్నే మార్చేసేవాడు బ్రహ్మి. ఆయన పంచ్ లుంటే సినిమా సగం హిట్ అనే టాక్ ఉండేది అప్పట్లో. ప్రస్తుతం ఆ స్టార్ కమెడియన్ హవా నడవట్లేదు. అది వేరే సంగతి., ఇప్పుడు ఆ అదృష్టం మరో హాస్యనటుడికి పట్టింది. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పిచ్చ పాపులర్ అయిన ఫృధ్వీ… ఇప్పుడు సినిమాల్ని శాసిస్తున్నాడు. తన కోసమే పుట్టుకొస్తున్న పాత్రల్ని అలవోకంగా పండిస్తూ జనాల్ని థియేటర్లకు రప్పిస్తున్నాడు. తాజాగా తన టాలెంట్ తో సునీల్ ను గట్టెక్కించాలని ఫిక్స్ అయ్యాడు.

సునీల్ నటించిన జక్కన్న ట్రయిలర్ కొన్ని గంటల కిందట విడుదలైంది. ట్రయిలర్ లో సునీల్ హీరోయిజం, హీరోయిన్ అందాల కంటే ఫృధ్వీ డైలాగులే ఎక్కువ పాపులర్ అయ్యాయి. చూస్తుంటే.. సినిమాకు ఫృధ్వీనే ఆయువుపట్టుగా నిలిచేట్టు కనిపిస్తున్నాడు. అందుకే వరుస ఫ్లాపులతో ఉన్న సునీల్ ను ఈసారి ఫృధ్వీ ఒడ్డున పడేస్తాడంటూ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. అదే కనుక జరిగితే… సునీల్ సేఫ్ పొజిషన్ లోకి వెళ్లడంతో పాటు… ఫృద్ధి రేంజ్ కూడా డబుల్ అవుతుంది.

First Published:  25 Jun 2016 4:58 AM IST
Next Story