మోక్షగుండం పేరు ఎప్పుడైనా విన్నారా బాబూ..
2004కు ముందు సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పేవారు. అయితే అప్పట్లో న్యూస్ చానళ్లు లేకపోవడం వల్ల ఆ మాటల వీడియోలు లేవు. అందుకే చంద్రబాబు అలా ఎప్పుడూ అనలేదని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ వచ్చారు. కానీ ఇటీవల చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూసిన తర్వాత అప్పట్లో వ్యవసాయం దండగా అని చంద్రబాబు అవలీలగానే అని ఉంటారనిపిస్తుంది. తాజాగా రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెడుతూ తనకిష్టమైన స్విస్ […]
2004కు ముందు సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పేవారు. అయితే అప్పట్లో న్యూస్ చానళ్లు లేకపోవడం వల్ల ఆ మాటల వీడియోలు లేవు. అందుకే చంద్రబాబు అలా ఎప్పుడూ అనలేదని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ వచ్చారు. కానీ ఇటీవల చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూసిన తర్వాత అప్పట్లో వ్యవసాయం దండగా అని చంద్రబాబు అవలీలగానే అని ఉంటారనిపిస్తుంది.
తాజాగా రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెడుతూ తనకిష్టమైన స్విస్ చాలెంజ్ విధానానికి కేబినెట్ చేత ఆమోద ముద్ర వేయించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… మనదేశ ఇంజనీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణాన్ని దేశీయ కంపెనీలకు ఎందుకు అప్పగించడం లేదని మీడియా ప్రశ్నించగా… మనవాళ్లకు ఇస్తే మురికివాడలు నిర్మిస్తారని అనేశారు చంద్రబాబు. అసలు దేశీయ కంపెనీలకు ఒక్క సిటి కట్టిన అనుభవమైనా ఉందా అని ఎద్దేవా చేశారు. మన వాళ్లకు అవకాశం ఇస్తే మురికివాడను కడుతారు అంటూ హేళన చేశారు.
చంద్రబాబుకు సింగపూర్ మీద ప్రేమ ఉంటే ప్రదర్శించుకోవచ్చు గానీ ఇలా భారతదేశంలోని కంపెనీలను, ఇంజనీర్లను హేళన చేయడం సరైనది కాదు. అయినా మన దేశ కంపెనీలు ప్రపంచంలోని పలుదేశాల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతున్నాయి. అవి సీఎంకు కనిపించకపోవడం దురదృష్టకరం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహోన్నత ఇంజనీర్లు పుట్టిన దేశంలో ఉంటూ ఇక్కడి ఇంజనీర్లు చేతగాని వారు అని ఒక సీఎం సర్టిఫై చేయడం ఇదో విపరీతమే.
Click on Image to Read: