జగన్ గురించి తాజా ఇంటర్వ్యూలో కొమ్మినేని ఏం చెప్పారంటే...
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దెబ్బకు ఎన్టీవీలో ఉద్యోగం పోగొట్టుకుని సాక్షిలో చేరిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనను ఎన్టీవీలో మార్నింగ్ షో నుంచి తొలగించారని తెలియగానే జగన్ పిలిపించుకున్నారని చెప్పారు. ”అన్నా మీకు అండగా ఉంటా” అని జగన్ అన్నారని చెప్పారు. అయితే అప్పటికీ కూడా ఎన్టీవీలో తిరిగి తెరపై అవకాశం ఇస్తారన్న ఉద్దేశంతోనే కొద్దిరోజులు ఎదురుచూసానని కొమ్మినేని చెప్పారు. అందుకే ”అండగా ఉంటానని ఆ మాట అన్నారు […]
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దెబ్బకు ఎన్టీవీలో ఉద్యోగం పోగొట్టుకుని సాక్షిలో చేరిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనను ఎన్టీవీలో మార్నింగ్ షో నుంచి తొలగించారని తెలియగానే జగన్ పిలిపించుకున్నారని చెప్పారు. ”అన్నా మీకు అండగా ఉంటా” అని జగన్ అన్నారని చెప్పారు. అయితే అప్పటికీ కూడా ఎన్టీవీలో తిరిగి తెరపై అవకాశం ఇస్తారన్న ఉద్దేశంతోనే కొద్దిరోజులు ఎదురుచూసానని కొమ్మినేని చెప్పారు. అందుకే ”అండగా ఉంటానని ఆ మాట అన్నారు చాలు” అని జగన్ కి చెప్పి వచ్చానన్నారు. అయితే తనను తిడుతూ మేసేజ్ పెట్టిన వ్యక్తిని ఎన్టీవీ యాజమాన్యం చర్చలో కూర్చొబెట్టడంతో తన ఆత్మగౌరవం దెబ్బతినిందని కొమ్మినేని వెల్లడించారు.
అందుకే ఎన్టీవీకి రాజీనామా చేయాల్సివచ్చిందన్నారు. మరో ఛానల్ వారు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చినా తిరిగి ఎందుకనో వెనక్కు తగ్గారని చెప్పారు. ఆ సమయంలోనే సాక్షి వారు సంప్రదించడంతో వెళ్లానని చెప్పారు. అవకాశం ఇచ్చినందుకు జగన్‌కు తాను కృతజ్ఞతలు చెబుతున్నానని కొమ్మినేని అన్నారు. ఒక విధంగా ఈ సమయంలో తనకు జగన్ అండగా నిలిచినట్టేనని వెల్లడించారు.
వైఎస్ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని తెలుసని… ఆ లక్షణాలే జగన్‌కు కూడా ఉన్నాయనిపించిందన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందనుకుంటే చివరకు తన ఉద్యోగం ఊడిపోయిందన్నారు కొమ్మినేని. ఇప్పటి వరకు జగన్‌ను తాను రెండుసార్లు మాత్రమే కలిశానని చెప్పారు. చాలా మంది ఎన్నికల ముందు టీడీపీ నాయకులు జగన్‌ను కలిశారని వారందిరినీ తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న భావన ఉందన్నారు. పవన్, మోదీ, రాష్ట్ర విభజన, రుణమాఫీ తదితర హామీలు చంద్రబాబుకు కలిసొచ్చాయన్నారు.
Click on Image to Read: