బాబుగారి అవినీతికి అండగా నిలిచి అభాసుపాలయ్యారా...
ఏపీలో కొందరు అధికారులు చంద్రబాబును గుడ్డిగా సమర్థిస్తున్నట్టుగా ఉంది. తాజాగా గురువారం జరిగిన ఏపీ జెన్‌కో బోర్డు మీటింగ్‌లో జరిగిన సంఘటన ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్‌తో పాటు మిగిలిన బోర్డు సభ్యులందరూ అభిప్రాయపడగా… ఒక్క జెన్‌కో ఎండీ విజయానంద్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించి కార్నర్ అయ్యారు. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల టెండర్లో భారీగా అవినీతి జరిగిందని, కాబట్టి టెండర్లు రద్దు చేయాలని అజయ్ […]
ఏపీలో కొందరు అధికారులు చంద్రబాబును గుడ్డిగా సమర్థిస్తున్నట్టుగా ఉంది. తాజాగా గురువారం జరిగిన ఏపీ జెన్‌కో బోర్డు మీటింగ్‌లో జరిగిన సంఘటన ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్‌తో పాటు మిగిలిన బోర్డు సభ్యులందరూ అభిప్రాయపడగా… ఒక్క జెన్‌కో ఎండీ విజయానంద్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించి కార్నర్ అయ్యారు.
కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల టెండర్లో భారీగా అవినీతి జరిగిందని, కాబట్టి టెండర్లు రద్దు చేయాలని అజయ్ జైన్ చెప్పగా విజయానంద్ మాత్రం వ్యతిరేకించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ విజయానంద్ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకవిధంగా అవినీతి అంతా చంద్రబాబు ఆదేశాల మేరకే జరిగిందన్న భావన కలిగించారు. ఈ కాంట్రాక్టులో చంద్రబాబుకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందున రద్దు చేయడం సరికాదంటూ విజయానంద్ వ్యాఖ్యానించారు. విజయానంద్ ఇలా అనే సరికి బోర్డు సభ్యులంతా ఆశ్చర్యపోయారట.
అవినీతి జరిగిందని తాము చెబుతుంటే సీఎం ప్రమేయంతో ఇదంతా చేస్తున్నట్టు విజయానంద్ చెప్పడం చూసి కంగుతిన్నారు. విజయానంద్ తీరుపై అజయ్ జైన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రముఖ పత్రికల కథనాలు చెబుతున్నాయి. టెండర్లలో దాదాపు రూ. 2,860కోట్ల చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయని అజయ్ జైన్ వివరించారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని జెన్ కో ఎండి విజయానంద్‌కు బోర్డు సూచించింది. అయినప్పటికీ విజయానంద్ తీరులో మార్పు రాలేదని చెబుతున్నారు. ఎల్ 1గా ఉన్న సంస్థలతో చర్చలు జరిపామని కొద్ది మేర తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమావేశంలో చెప్పారు. కొద్దిగా అంటే ఎంత అని బోర్డు సభ్యులు ప్రశ్నించడంతో విజయానంద్ బిత్తరపోయారని చెబుతున్నారు. చివరకు సమావేశంలో విజయానంద్ తాను టార్గెట్‌గా మారానన్న భావనకు వచ్చినట్టు చెబుతున్నారు.
జెన్ కో కార్యాలయం విజయవాడకు తరలించడం కోసం టీడీపీ నేతకు చెందిన భవనాన్ని అద్దెకు తీసుకుంటున్నట్టు విజయానంద్ చెప్పడంపై కూడా సమావేశంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. అంత అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని బోర్డు సభ్యులంతా ఒక్కసారిగా అనడంతో మరోసారి విజయానంద్ ఇబ్బందిపడ్డారు. మొత్తం మీద విజయానంద్… చంద్రబాబు అవినీతికి, టీడీపీ నేతలకు వంత పాడుతున్నారన్న అభిప్రాయం కలిగేలా జెన్‌కో బోర్డు సమావేశం సాగినట్టు చెబుతున్నారు.
Click on Image to Read: