Telugu Global
NEWS

గల్లావారి వేలంపాట... గద్దలా తన్నుకుపోయే ఆట

గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు సొంత సామ్రాజ్యమైపోయింది. తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని నిరూపించుకుంటున్నారు. తాజాగా చిత్తూరు నుంచి వలసవెళ్లి గుంటూరులో ఎంపీగా జెండా పాతిన గల్లా జయదేవ్‌ ఇప్పుడు అక్కడో ఘనకార్యం చేసేందుకు సిద్ధపడ్డారు. ఇంటి యజమాని నోట్లో మట్టికొట్టి కోట్లాది విలువైన భవనాన్ని సింపుల్‌గా కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. బ్యాంకు అధికారులు కూడా గల్లావారితో కలిసిపోయారు. ఇంకేముంది రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలు కూడా కాసేపు రిజర్వ్‌లో పడ్డాయి. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని 300 గజాల్లో […]

గల్లావారి వేలంపాట... గద్దలా తన్నుకుపోయే ఆట
X

గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు సొంత సామ్రాజ్యమైపోయింది. తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని నిరూపించుకుంటున్నారు. తాజాగా చిత్తూరు నుంచి వలసవెళ్లి గుంటూరులో ఎంపీగా జెండా పాతిన గల్లా జయదేవ్‌ ఇప్పుడు అక్కడో ఘనకార్యం చేసేందుకు సిద్ధపడ్డారు. ఇంటి యజమాని నోట్లో మట్టికొట్టి కోట్లాది విలువైన భవనాన్ని సింపుల్‌గా కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. బ్యాంకు అధికారులు కూడా గల్లావారితో కలిసిపోయారు. ఇంకేముంది రిజర్వ్‌ బ్యాంకు నిబంధనలు కూడా కాసేపు రిజర్వ్‌లో పడ్డాయి.

గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని 300 గజాల్లో మూడు అంతస్తుల భవనాన్ని గుంటుపల్లి శ్రీనివాసరావు కొన్నేళ్ల క్రితం నిర్మించారు. 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక నెలనెల ఈఎంఐ కట్టలేకపోయాడు. అదే సమయంలో 2014లో ఈ భవనాన్ని గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానికి సొమ్ము చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గల్లా జయదేవ్ తో… బ్యాంకు డీజీఎం కుమ్మకయ్యారని తెలుస్తోంది. రిజర్వ్ ధరను మరీ దారుణంగా తగ్గించేశారు. దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే ఈ భవనానికి వేలంలో ప్రారంభ ధరను కేవలం రూ. 2.80 కోట్లుగా నిర్ణయించేశారు. వేలం ప్రకటన జారీ చేశారు.

మంచి ఏరియాలో భవనం కావడంతో దీన్ని సొంతం చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే అలా ఇంటిని చూసేందుకు, వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన వారిని తెలుగు తమ్ముళ్లు బెదిరించడం ప్రారంభించారు. ”ఎంపీ ఉంటున్న ఇల్లు… ఒకవేళ మీరు వేలం పాటలో గెలుచుకున్నా గల్లా వారిని ఖాళీ చేయించే దమ్ముందా… ఖాళీ చేయించి ఇంటిని స్వాధీనం చేసుకునేంత సినిమా ఉందా” అంటూ వేలంపాటలో పాల్గొనేందుకు ప్రయత్నించిన వారిని బెదిరించారు. ఇదే సమయంలో బ్యాంకు అధికారులు కూడా గల్లావారికి చేయాల్సిన సేవ చేస్తూ వచ్చారు.

ఇంటి వేలం గురించి తెలుసుకున్నయజమాని శ్రీనివాసరావు డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ నెల 24లోగా రూ. కోటి చెల్లిస్తే, మిగతా సగం చెల్లించడానికి సహేతుకమైన గడువు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే అప్పటికే గల్లా జయదేవ్‌తో చెలిమి చేసిన బ్యాంకు అధికారులు ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం తుంగలో తొక్కి 24వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది.

స్థానిక వ్యాపారి ఒకరు వేలంలో పాల్గొనేందుకు డిపాజిట్ చెల్లించినా … బ్యాంకు అధికారులు మాత్రం ఆయనకు వేలంలో పాల్గొనేందుకు అవసరమైన పాస్‌వర్డ్‌ను గురువారం అర్థరాత్రి వరకు ఇవ్వలేదు. అదే సమయంలో టీడీపీ నేతలు సదరు వ్యాపారిని వేలం నుంచి తప్పుకోవాలని బెదిరించే పనిలో ఉన్నారు.

రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం.. వేలం వేయాల్సిన భవనాన్ని ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేసి ఆ తర్వాతే వేలం పాట నిర్వహించాలి. కానీ బ్యాంకు అధికారులు మాత్రం అద్దెకుంటున్న గల్లాజయదేవ్‌ను ఖాళీ చేయించలేదు. పైగా ఆయనతో కుమ్మక్కు అయి తక్కువ ధరకే భవనాన్ని ఆయన చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులకు కూడా భారీగా ముడుపులు ముట్టాయని భావిస్తున్నారు. మొత్తం మీద అమరావతిలో ఖాళీ భూములనే కాకుండా కట్టిన భవనాలను కూడా టీడీపీ నేతలు వదలిపెట్టడం లేదన్న మాట.

Click on Image to Read:

kommineni-ys-jagan

YS-Jagan-London-tour

ysrcp-krishnadistrict

ap-capital

karanam-balaram-vs-chandrab

bhumana-karunakar-reddy

ap-krishna-pushkaras-3d-des

ap-dairy

ysrcp

hyderabad beggars

professer-nageshwar

sakshi

giddaluru-mla

narayana-srichaitany-colleg

mudragada

gandi-babji

ambati

tdp badvel incharge vijaya jyothi

kodela

First Published:  23 Jun 2016 10:26 PM GMT
Next Story