వైఎస్ అలా చేయలేదు... అదంతా తప్పుడు ప్రచారమే...
ఫిరాయింపు రాజకీయాలు వైఎస్‌తోనే మొదలయ్యాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించారు. వైఎస్ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించలేదన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రుల్లాగా ఎమ్మెల్యేలకు కండువా కప్పిన ఉదంతాలే లేవన్నారు. వారి పార్టీల్లో ఇమడలేని ఎమ్మెల్యేలు కొందరు వైఎస్‌ను కలిసి కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా ఉంటామని కోరారే గానీ ఎప్పుడూ వైఎస్ ఇతరపార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పలేదన్నారు డీకే అరుణ. ఇదంతా మీడియా ఏకపక్షంగా చేస్తున్న ప్రచారమని ఆమె విమర్శించారు. […]
ఫిరాయింపు రాజకీయాలు వైఎస్‌తోనే మొదలయ్యాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించారు. వైఎస్ ఎప్పుడూ ఫిరాయింపులను ప్రోత్సహించలేదన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రుల్లాగా ఎమ్మెల్యేలకు కండువా కప్పిన ఉదంతాలే లేవన్నారు. వారి పార్టీల్లో ఇమడలేని ఎమ్మెల్యేలు కొందరు వైఎస్‌ను కలిసి కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా ఉంటామని కోరారే గానీ ఎప్పుడూ వైఎస్ ఇతరపార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పలేదన్నారు డీకే అరుణ. ఇదంతా మీడియా ఏకపక్షంగా చేస్తున్న ప్రచారమని ఆమె విమర్శించారు.
కొందరు నేతల అల్లరి వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌కు చెడ్డపేరు వస్తోందన్నారు. సీఎం కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆఫర్ వచ్చిందని దాన్నీ తాను తిరస్కరించడం వల్లే వ్యక్తిగతంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అరుణ చెప్పారు. తన జోలికి వస్తే రాజకీయంగా తానంటే ఏంటో తెలుస్తుందన్నారు. తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు పనిగట్టుకుని డీకే అరుణ టీఆర్‌ఎస్‌లో చేరుతుందంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ప్రచారం చేసే వారు అసలు నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని నడిపించేందుకు తాను సిద్ధమని ఆమె చెప్పారు. తెలంగాణలో ఒక సామాజికవర్గాన్ని అణచివేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం జనంలో బలంగానే ఉందన్నారామె.
Click on Image to Read: