కొత్త ఆలోచనలు కావాలా...కాస్త నడవండి!
ఏదైనా సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తూ మెదడుని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారా…అలాచేస్తే మీ సమస్య తీరదు… వెంటనే ఆలోచనలు ఆపి… పరిగెత్తండి… అంటున్నారు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు. ఈ దేశంలోని బార్ ఇలాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ ఉపాయం చెబుతున్నారు. ఆలోచనలు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెదడు మరో కొత్త ఆలోచన చేయలేదని, వాటిని అక్కడితో ఆపేసి, బయటకు వెళ్లటం, నడవటం చేస్తే మెదడు తిరిగి పదునెక్కుతుందని వారు సలహా ఇస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని సైకలాజికల్, […]
ఏదైనా సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తూ మెదడుని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారా…అలాచేస్తే మీ సమస్య తీరదు… వెంటనే ఆలోచనలు ఆపి… పరిగెత్తండి… అంటున్నారు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు. ఈ దేశంలోని బార్ ఇలాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ ఉపాయం చెబుతున్నారు. ఆలోచనలు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెదడు మరో కొత్త ఆలోచన చేయలేదని, వాటిని అక్కడితో ఆపేసి, బయటకు వెళ్లటం, నడవటం చేస్తే మెదడు తిరిగి పదునెక్కుతుందని వారు సలహా ఇస్తున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని సైకలాజికల్, బ్రెయిన్ సైన్సెస్ విభాగపు మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. సృజనాత్మకంగా ఆలోచించాలంటే అదేపనిగా ఆలోచనలతో బుర్రని వేడెక్కనీయకూడదని, ఆ స్థితికి చేరినపుడు ఆలోచనలు ఆపేసి, తేలిగ్గా ఉండే చిన్నపాటి పనులను చేస్తూ ఉంటే మెదడు మరింత చురుగ్గా తన పని తానుచేస్తుందని అంటున్నారు. స్నానం, తోటపని లాంటి…ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాని పనిలో నిమగ్నమైతే మెదడు ఆలోచనల ఒత్తిడి నుండి బయటపడి స్వేచ్ఛగా ఉంటుందని, అప్పుడే అది సమస్యలను పరిష్కరించగలుగుతుందని వారు వివరిస్తున్నారు. చాలామంది తమకు నడుస్తున్నపుడు కొత్త ఆలోచనలు వస్తాయని చెబుతుంటారని, అందుకు కారణం ఇదేనని ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు.