కరణం బలరాంకు అవమానం... బాబు కొత్త లెక్క...
అద్దంకి టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంకు చంద్రబాబు పొగపెట్టడం ప్రారంభమైంది. ఈ విషయం బుధవారం ఒంగోలులో జరిగిన రైతు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో స్పష్టమైంది. సభలో చంద్రబాబు తీరు చూసి బలరాంతో పాటు ఇతర టీడీపీ నేతలు అవాక్కయ్యారు. వేదికపై కరణం బలరాం వైపు చూసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. వేదికపైకి వస్తున్న సమయంలో అందరిని దగ్గరకు వెళ్లి పలకరిస్తూ ముందుకెళ్లిన చంద్రబాబు… కరణం బలరాం వద్దకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయారు. ఆయనను […]
అద్దంకి టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంకు చంద్రబాబు పొగపెట్టడం ప్రారంభమైంది. ఈ విషయం బుధవారం ఒంగోలులో జరిగిన రైతు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో స్పష్టమైంది. సభలో చంద్రబాబు తీరు చూసి బలరాంతో పాటు ఇతర టీడీపీ నేతలు అవాక్కయ్యారు.
వేదికపై కరణం బలరాం వైపు చూసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. వేదికపైకి వస్తున్న సమయంలో అందరిని దగ్గరకు వెళ్లి పలకరిస్తూ ముందుకెళ్లిన చంద్రబాబు… కరణం బలరాం వద్దకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయారు. ఆయనను కనీసం పలకరించకుండానే ముందుకెళ్లారు.
ఆ పక్కనే ఉన్న రావెల కిషోర్ బాబు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్ వద్దకు నవ్వుతూ వారి భుజంపై చేయి వేసి కుశల ప్రశ్నలు వేశారు చంద్రబాబు. దీంతో కరణం బలరాం ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కూడా చంద్రబాబు దగ్గరకు వెళ్లి పలకరించారు.
ఇలా చేయడం ద్వారా కరణం బలరాంకు చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు భావిస్తున్నారు. తాను ఏరికోరి తెచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇబ్బందిపెడితే సహించేది లేదన్న సంకేతాలు కరణంకు పంపినట్టు అయిందని భావిస్తున్నారు. పాత నేతల కన్నా ఫిరాయింపుదారులే తనకుముద్దు అని చంద్రబాబు చాటుకున్నట్టుగా అయిందంటున్నారు. ఈ పరిణామం తర్వాత సభ ముగిసే వరకూ, కరణంను చంద్రబాబు పలకిరించలేదు. ఈ విషయాన్నిబలరాంకు చంద్రబాబు హృదయం అర్ధమయ్యేలా టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించడం విశేషం. కరణం బలరాం కూడా సభలో ముభావంగా కనిపించారు. వచ్చేఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని వాటితో పాతవారికి, కొత్తవారికి సర్దుబాటు చేస్తానని చంద్రబాబు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోవడంతో కొందరికి పొగ పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.
Click on Image to Read: