మాది అలసిపోయే సైన్యం కాదు... కవాతుకు సిద్ధపడ్డ సైన్యం... బాబు విషయం టీడీపీ నేతలే మాతో చెప్పారు..
చంద్రబాబు పాలనపై ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైసీపీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలుకూడా సంతోషంగా లేరన్నారు. ఇతరపార్టీల నేతలతోనూ తమకు మానవ సంబంధాలుంటాయని కాబట్టి అక్కడి విషయాలు కూడా తెలుస్తుంటాయన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా పెద్ద తప్పు చేశామని వాపోతున్నారని చెప్పారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ చంద్రబాబుకు మతిచెడిందంటూ సాధారణ చర్చల్లో పెద్దపెద్ద మాటలే చెప్పారన్నారు. వైసీపీది అలసిపోయే సైన్యం కాదని … ఏ క్షణమైనా కవాతు […]
చంద్రబాబు పాలనపై ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైసీపీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలుకూడా సంతోషంగా లేరన్నారు. ఇతరపార్టీల నేతలతోనూ తమకు మానవ సంబంధాలుంటాయని కాబట్టి అక్కడి విషయాలు కూడా తెలుస్తుంటాయన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా పెద్ద తప్పు చేశామని వాపోతున్నారని చెప్పారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ చంద్రబాబుకు మతిచెడిందంటూ సాధారణ చర్చల్లో పెద్దపెద్ద మాటలే చెప్పారన్నారు. వైసీపీది అలసిపోయే సైన్యం కాదని … ఏ క్షణమైనా కవాతు చేసేందుకు సిద్ధంగా ఉండే సైన్యమని భూమన చెప్పారు.
చంద్రబాబు ఈ రాష్ట్రం పాలిట చేతబడులు చేసే మంత్రగాడిలా తయారయ్యాడని విమర్శించారు. చంద్రబాబు కనిపిస్తే బూచోడు వచ్చాడంటూ ప్రజలు టీవీలు కట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము, తప్పుడు హామీలతో ఎన్నిసార్లైనా అధికారంలోకిరావచ్చన్న మానసికస్థితికి చంద్రబాబు దిగజారారని అన్నారు. ముద్రగడ విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. చివరకు కోనసీమ రైతులే క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి చంద్రబాబు పాలనలో వచ్చిందన్నారు. ఉచిత విద్యుత్ వద్దని చెప్పిన చంద్రబాబు రైతు బాంధవుడు ఎలా అవుతారని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
Click on Image to Read: