కుంగిన తాత్కాలిక రాజధాని భవనం ఫ్లోర్...
అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజధాని భవనాల నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈప్రాంతంలో భారీ భవనాల నిర్మాణం ఎంతవరకు క్షేమం అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. తాజాగా తాత్కాలిక సచివాలయంలోని ఒక ఫ్లోర్ మూడు అంగుళాల మేర కుంగినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అక్కడ పర్యటించిన నిపుణుల కమిటీ దీన్ని గుర్తించిందని … అందుకే నాలుగో బ్లాక్‌లో నిర్మించిన ఫ్లోర్‌ను వంద అడుగుల మేర పగులగొట్టినట్టు చెబుతున్నారు. ఫ్లోర్‌ను ఎందుకు పగులగొట్టాల్సి వచ్చిందని అక్కడి సిబ్బందిని […]
అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజధాని భవనాల నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈప్రాంతంలో భారీ భవనాల నిర్మాణం ఎంతవరకు క్షేమం అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. తాజాగా తాత్కాలిక సచివాలయంలోని ఒక ఫ్లోర్ మూడు అంగుళాల మేర కుంగినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇటీవల అక్కడ పర్యటించిన నిపుణుల కమిటీ దీన్ని గుర్తించిందని … అందుకే నాలుగో బ్లాక్‌లో నిర్మించిన ఫ్లోర్‌ను వంద అడుగుల మేర పగులగొట్టినట్టు చెబుతున్నారు. ఫ్లోర్‌ను ఎందుకు పగులగొట్టాల్సి వచ్చిందని అక్కడి సిబ్బందిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇటీవల కొందరు నిపుణులు వచ్చారని ఆ తర్వాత ఫ్లోర్‌ను పగులగొట్టాల్సిందిగా తమకు ఆదేశాలు వచ్చాయని చెప్పారు. మూడు అంగుళాల మేర ఫ్లోర్ కుంగడంతోనే నిపుణుల కమిటీ పగులగొట్టాల్సిందిగా ఆదేశాలిచ్చిందని చెబుతున్నారు.
ఫ్లోర్ కింద ఏకంగా ఆరు నుంచి ఏడు అడుగల మేర భారీ గోతులు పడ్డాయని గుర్తించారు. ఆ గోతుల్లోకి నీరు ఉబికి వస్తోంది. దీంతో ఇసుక, మట్టితో నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితిని చూసిన తర్వాత ఇక్కడ వర్షాకాలం నిర్మాణాలు కుంగే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొద్ది రోజులక్రితమే తాత్కాలిక రాజధాని పక్కనే ఒక వ్యక్తి నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో జాకీల సాయంతో దాన్ని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చోట భారీ భవనాల నిర్మాణం ఎంతవరకు శ్రేయస్కరం అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాంతంలో భారీ భవనాల నిర్మాణం సరికాదని పలువురు నిపుణులు కూడా హెచ్చరించారు. అయినా సరే ప్రభుత్వం వాటన్నింటిని లెక్కచేయకుండా ముందుకెళ్తోంది.
Click on Image to Read: