నారాయణ విద్యాసంస్థల ముందు ధర్నా చేసే దమ్ముందా?
తెలంగాణలో ఇష్టానుసారంగా పెరిగిపోయిన విద్యార్థుల ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. తెలుగునాడు విద్యార్థి సంఘం (టీఎన్ ఎస్ ఎఫ్) తెలంగాణ విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల నియంత్రణలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ.. ఆరోపిస్తూ.. డైరెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అక్కడున్న పోలీసులు లోనికి వెళ్లకుండా వీరిని అడ్డుకున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులు తెలంగాణ సీఎంపై మండిపడ్డారు. తెలంగాణలో […]
BY sarvi22 Jun 2016 8:51 AM IST
X
sarvi Updated On: 23 Jun 2016 5:34 AM IST
తెలంగాణలో ఇష్టానుసారంగా పెరిగిపోయిన విద్యార్థుల ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. తెలుగునాడు విద్యార్థి సంఘం (టీఎన్ ఎస్ ఎఫ్) తెలంగాణ విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల నియంత్రణలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ.. ఆరోపిస్తూ.. డైరెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అక్కడున్న పోలీసులు లోనికి వెళ్లకుండా వీరిని అడ్డుకున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులు తెలంగాణ సీఎంపై మండిపడ్డారు. తెలంగాణలో లక్షల ఫీజులు చేస్తోన్న విద్యాసంస్థలకు ముకుతాడు వేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. వెంటనే అలాంటి విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
దీనికి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ ఎస్ వి) ఘాటుగానే స్పందించింది. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం విద్యార్థి సమస్యలపై ద్వంద వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. లక్షలకు లక్షలు వసూలు చేస్తూ… తెలుగు రాష్ర్టాల్లో విద్యావ్యవస్థను శాసిస్తోన్న నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల ముందు ఆందోళన చేసే దమ్ముందా? అని సవాలు విసిరారు. మేం కూడా వస్తాం రండి..కలిసి ధర్నా చేద్దామంటూ పలువురు తెలంగాణ వాదులు సైతం డిమాండ్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు నారాయణ విద్యాసంస్థల్లో ఆత్మహత్య చేసుకుంటుంటే… ఇంతకాలం టీఎన్ ఎస్ ఎఫ్ కళ్లు మూసుకుపోయాయా? అని ప్రశ్నిస్తున్నారు. వారి తల్లిదండ్రుల కంట కన్నీరు మిమ్మల్ని కదిలించలేదా? అని నిలదీస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడటాన్ని తాము తప్పుబట్టడం లేదని, కానీ సొంతపార్టీనాయకుల సంస్థల విషయంలో ఒకలా? ఇతరుల విషయంలో మరోలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా ఉంటే రెండు రాష్ర్టాల ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Next Story