సాక్షి ప్రసారాలు తిరిగి ప్రారంభం
గత 12 రోజులుగా నిలిచిపోయిన సాక్షి ప్రసారాలు విశాఖ జిల్లాలో పునర్‌ప్రారంభమయ్యాయి. 12 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖలోని అన్ని ఛానళ్ల, పత్రికల జర్నలిస్టులు ఐక్యంగాపోరాటం చేయడం వల్లే ఇది సాధ్యమైందని జర్నలిస్టులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరే ఛానల్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చినా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పారు. ముద్రగడ దీక్ష ముగిసేవరకు సాక్షిప్రసారాలను నిలిపివేయాలని ఎంఎస్ఓలను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని చెబుతున్నారు. ముద్రగడ దీక్ష ముగియడం కూడా […]
గత 12 రోజులుగా నిలిచిపోయిన సాక్షి ప్రసారాలు విశాఖ జిల్లాలో పునర్‌ప్రారంభమయ్యాయి. 12 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖలోని అన్ని ఛానళ్ల, పత్రికల జర్నలిస్టులు ఐక్యంగాపోరాటం చేయడం వల్లే ఇది సాధ్యమైందని జర్నలిస్టులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరే ఛానల్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చినా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పారు.
ముద్రగడ దీక్ష ముగిసేవరకు సాక్షిప్రసారాలను నిలిపివేయాలని ఎంఎస్ఓలను ప్రభుత్వ పెద్దలు ఆదేశించారని చెబుతున్నారు. ముద్రగడ దీక్ష ముగియడం కూడా సాక్షి ప్రసారాలు రావడానికి మరోకారణంగా భావిస్తున్నాయి. ఈసందర్భంగా విశాఖలో జర్నలిస్టులు స్వీట్లుపంచుకున్నారు. తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకంచేశారు. మరో వైపు ఇంకా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో సాక్షి ప్రసారాల పునరుద్దరణ జరగలేదు. ఆయా ప్రాంతాల్లో ఎంఎస్‌వోలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Click on Image to Read: