గూడ మరణంతో మూగబోయిన పల్లెపాట!
అక్కోపోదాం రావే.. మన ఊరి దవాఖానకు.. నేను రానుబిడ్డో గంగాల దవఖానకు… ఈ ఊరు మనదిరా… ఈ వాడ మనదిరా.. దొర ఏందిరో.. ఆని పీకుడేందిరో..! భద్రం కొడుకో.. కొమురన్న దొర.. ఈ పాటలు వింటే నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. నెత్తురులో విప్లక కణాలు పునరుత్తేజమవుతాయి. మనస్సులో తిరుగుబాటు ఉవ్వెత్తున ఎగిసి కదనరంగంలో దూసుకెళ్లేలా చేస్తాయి. పాటల్లో వాడుక పదాలతో.. విప్లవ భావాలు.. ఆధిపత్య ధోరణిపై తిరుగుబావుటా ఎగరేసిన తెలంగాణ విప్లవ కవి గూడ అంజయ్య మంగళవారం […]
BY sarvi22 Jun 2016 2:30 AM IST
X
sarvi Updated On: 22 Jun 2016 5:42 AM IST
అక్కోపోదాం రావే.. మన ఊరి దవాఖానకు.. నేను రానుబిడ్డో గంగాల దవఖానకు…
ఈ ఊరు మనదిరా… ఈ వాడ మనదిరా..
దొర ఏందిరో.. ఆని పీకుడేందిరో..!
భద్రం కొడుకో.. కొమురన్న దొర..
ఈ పాటలు వింటే నరాల్లో రక్తం ఉప్పొంగుతుంది. నెత్తురులో విప్లక కణాలు పునరుత్తేజమవుతాయి. మనస్సులో తిరుగుబాటు ఉవ్వెత్తున ఎగిసి కదనరంగంలో దూసుకెళ్లేలా చేస్తాయి. పాటల్లో వాడుక పదాలతో.. విప్లవ భావాలు.. ఆధిపత్య ధోరణిపై తిరుగుబావుటా ఎగరేసిన తెలంగాణ విప్లవ కవి గూడ అంజయ్య మంగళవారం మృతిచెందారు. గతకొంతకాలంగా మూత్రపిండాలు, పచ్చకామెర్లతో ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. హయత్‌నగర్ లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పలువురు విప్లవ రచయిత లకు స్ఫూర్తిగా నిలిచిన పాట మూగబోయింది.
ఆదిలాబాద్ జిల్లా దండపల్లి మండలం లింగాపూర్‌లో 1954 నవంబర్ 1న జన్మించారు. ఈయన భార్య నళిని. ముగ్గురు కుమార్తెలు. ఆదిలాబాద్‌లో ప్రభుత్వ టీచరుగా పనిచేసి కొంతకాలం తరువాత రాజధానికి కేవలం పాటల రచన కోసం వచ్చారు. ఈయన చిరకాల స్వప్నం విప్లవ సినిమాలకు పాటలు రాయడం. దాన్ని నెరవేర్చుకున్నారు. 1980-90 దశకాల్లో ఈతరం ఫిలింస్, స్నేహచిత్రం ప్రొడక్షన్స్‌ల బ్యానర్లలో ఈయన ఎక్కువ పాటలు రచించారు. తరువాత తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఆయన పాటల ద్వారా ప్రజల్ని ఒక్కతాటికి తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిది..
ప్రజా సమస్యలు, బానిసత్వం, సామ్రాజ్యవాదాలపై కలం ఎక్కుపెట్టి ప్రజల తరఫున అక్షర ఉద్యమం సాగించారు. అక్కో పోదాం రావే.. మన ఊరి దవాఖానకు.. నేను రానుబిడ్డో గంగాల దవఖానకు… ఈ ఊరు మనదిరా… ఈ వాడ మనదిరా.. పాటలు దేశంలోని పేదల దుస్థితులకు అద్దం పట్టాయి. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీఎం కేసీఆర్, చంద్రబాబు, ప్రతపక్ష నేత జగన్‌లు సంతాపం ప్రకటించారు. విప్లర రచయితలు, తెలంగాణ ఉద్యమకారులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. మంగళవారం రాత్రి గన్‌పార్కు వద్ద కొద్దిసేపు ఆయన మృతదేహాన్ని పలువురి సందర్శనార్థం ఉంచారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం ఆయన సొంతూరు ఆదిలాబాద్ జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ కు తరలించారు.
Next Story