నా కుటుంబాన్ని అవమానించిన వారికి దేవుడు వేసే శిక్ష కోసం ఎదురుచూస్తా... ఆ చల్లని కబురు విన్నాకే పండుగ చేసుకుంటా " బాబుపై ముద్రగడ
తనకు తన కుటుంబానికి చంద్రబాబు చేసిన అవమానంపై కాపు నేత ముద్రగడ తీవ్రంగా స్పందించారు. తన భార్యను, కోడలిని ల…. దానా అంటూ తిట్టుకుంటూ తీసుకెళ్లారని, తన కొడుకుని ల…. కొడుకా అంటూ కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారని మీడియా సమక్షంలో ముదగ్రడ కన్నీటి పర్యంతమయ్యారు. చరిత్రలో ఏ రాజకీయనాయకుడి కుటుంబానికి జరగని అవమానం తన కుటుంబానికి జరిగిందన్నారు. తనను అవమానించిన వారికి భగవంతుడే తగిన శిక్ష విధిస్తాడని అన్నారు. భగవంతుడు విధించే ఆ శిక్షకు సంబంధించిన చల్లనికబురు తాను […]
తనకు తన కుటుంబానికి చంద్రబాబు చేసిన అవమానంపై కాపు నేత ముద్రగడ తీవ్రంగా స్పందించారు. తన భార్యను, కోడలిని ల…. దానా అంటూ తిట్టుకుంటూ తీసుకెళ్లారని, తన కొడుకుని ల…. కొడుకా అంటూ కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారని మీడియా సమక్షంలో ముదగ్రడ కన్నీటి పర్యంతమయ్యారు. చరిత్రలో ఏ రాజకీయనాయకుడి కుటుంబానికి జరగని అవమానం తన కుటుంబానికి జరిగిందన్నారు. తనను అవమానించిన వారికి భగవంతుడే తగిన శిక్ష విధిస్తాడని అన్నారు. భగవంతుడు విధించే ఆ శిక్షకు సంబంధించిన చల్లనికబురు తాను వినేవరకూ ఏ పండుగ కూడా చేసుకోబోమని ప్రకటించారు.
చంద్రబాబు పాలనలో ఇదంతా ఒక భాగమేనని అన్నారు. కానిస్టేబుళ్లనుంచి డీజీపీ వరకు ఎంతో మంది తమ ఇంటిలో భోజనం చేశారని…అలాంటి వారి చేతే ల–కొడుకా, ల—దానా అని తిట్టుంచుకునేలా చంద్రబాబు చేశారని అన్నారు. తన శరీరంలో ఇప్పుడు రక్తం లేదన్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా దిన పత్రిక ఇస్తారని… తనకు మాత్రం 13 రోజులుగా పత్రిక గానీ, సెల్‌ఫోన్ గానీ అందుబాటులో లేకుండా చేశారని ఆవేదనచెందారు. చంద్రబాబు ఎన్ని అవమానాలకు గురిచేసినా భరిస్తామని.. ఉద్యమంనుంచి మాత్రం తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కాపు జేఏసీ నేతల వినతి మేరకు కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ దీక్షవిరమించారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడారు.
Click on Image to Read: