బద్వేల్‌కు ఎలా వస్తావో చూస్తాం... జిల్లా అధ్యక్షుడికి కార్యకర్తల వార్నింగ్
బద్వేల్ టీడీపీ వర్గపోరు రోడ్డెక్కింది. ఏకంగా కడప జిల్లా అధ్యక్షుడినే కార్యకర్తలు బెదిరించే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఇటీవల బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే జమరాములు టీడీపిలోకి ఫిరాయించడంతో పోరు మొదలైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయజ్యోతి, ఆమె అనుచరులు రగిలిపోతున్నారు. ప్రొద్దుటూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో జరిగిన సమావేశంతో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పైన విజయజ్యోతి వర్గీయులు తిరగబడ్డారు. విజయజ్యోతితో పాటు వచ్చిన సర్పంచ్‌లు, సీనియర్ కార్యకర్తలు… పనులుమొత్తం ఎమ్మెల్యే జయరాములుకే కేటాయించారని […]
బద్వేల్ టీడీపీ వర్గపోరు రోడ్డెక్కింది. ఏకంగా కడప జిల్లా అధ్యక్షుడినే కార్యకర్తలు బెదిరించే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఇటీవల బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే జమరాములు టీడీపిలోకి ఫిరాయించడంతో పోరు మొదలైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న విజయజ్యోతి, ఆమె అనుచరులు రగిలిపోతున్నారు. ప్రొద్దుటూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో జరిగిన సమావేశంతో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పైన విజయజ్యోతి వర్గీయులు తిరగబడ్డారు.
విజయజ్యోతితో పాటు వచ్చిన సర్పంచ్‌లు, సీనియర్ కార్యకర్తలు… పనులుమొత్తం ఎమ్మెల్యే జయరాములుకే కేటాయించారని మండిపడ్డారు. 10కోట్ల పనులు ఇప్పటి వరకు ఇచ్చారని… తమకు మాత్రం పట్టించుకోవడం లేదని రగిలిపోయారు. నీరు చెట్టు కింద కాలువలు తవ్వే పనులు కార్యకర్తలకు కేటాయించాలని ఫైల్ పంపితే ఇప్పటి వరకు దాన్నిపట్టించుకోలేదని విజయజ్యోతి ఆరోపించారు. పేరుకే తాను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నానని తాను చెబితే ఏ పని జరగడం లేదని చెప్పారు.
కార్యకర్తలు కూడా జయరాములకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అనుకుంటున్నారా మరేమైనా అనుకుంటున్నారా రుసరుసలాడారు. అయితే కార్యకర్తలు మాత్రం వెనక్కు తగ్గలేదు. నేరుగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిపైనే తిరగబడ్డారు. జయరాములకు సపోర్ట్ చేస్తారా… అసలు నీవు ఎలా బద్వేల్‌లోకి వస్తావో చూస్తామంటూ శ్రీనివాస్ రెడ్డిపై తిరగబడ్డారు. దీంతో బిత్తరపోయిన శ్రీనివాస్ రెడ్డి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమదారి తాము చూసుకుంటామని విజయజ్యోతి వర్గం హెచ్చరిస్తోంది.
Click on Image to Read: