కాళ్లు విరిగిన కుక్కపిల్ల... చక్రాల బండితో చకచకా నడిచేస్తోంది!
ఒక డాక్టరు చేసిన వినూత్న ఆలోచనతో రోడ్డు ప్రమాదంలో వెనుక కాళ్లు విరిగిపోయి నడవలేని స్థితికి చేరిన కు క్కపిల్ల ఒకటి తిరిగి నడవగలుగుతోంది. మైసూరులోని వెటర్నరీ వైద్యుడు డాక్టర్ మదన్ కోంపాల్ మూడేళ్ల మగ కుక్కపిల్లకు ఈ ఏర్పాటు చేశారు. కాళ్లు విరగటంతో పాటు వెన్నుకు సైతం పగుళ్లు ఏర్పడిన టామీ అనే ఈ కుక్కపిల్ల, ఆపరేషన్ తరువాత కొన్ని నెలలకు లేచి నిలబడగలిగింది. అయితే దాన్ని నడిపించాలనే లక్ష్యంతో మదన్ తేలిగ్గా ఉండే చక్రాలతో […]
ఒక డాక్టరు చేసిన వినూత్న ఆలోచనతో రోడ్డు ప్రమాదంలో వెనుక కాళ్లు విరిగిపోయి నడవలేని స్థితికి చేరిన కు క్కపిల్ల ఒకటి తిరిగి నడవగలుగుతోంది. మైసూరులోని వెటర్నరీ వైద్యుడు డాక్టర్ మదన్ కోంపాల్ మూడేళ్ల మగ కుక్కపిల్లకు ఈ ఏర్పాటు చేశారు. కాళ్లు విరగటంతో పాటు వెన్నుకు సైతం పగుళ్లు ఏర్పడిన టామీ అనే ఈ కుక్కపిల్ల, ఆపరేషన్ తరువాత కొన్ని నెలలకు లేచి నిలబడగలిగింది. అయితే దాన్ని నడిపించాలనే లక్ష్యంతో మదన్ తేలిగ్గా ఉండే చక్రాలతో బండిని రూపొందించి దాని వెనుక భాగంలో అమర్చారు. దీంతో అది ముందుకాళ్లు వెనుక చక్రాల ఆధారంగా చకచకా నడిచేస్తోంది. ప్లాస్టర్ తో అతికించిన వెనుక కాళ్లు నేలకు తాకకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడిది చక్రాలబండితో ఎలాంటి ఎగుడుదిగుడు రోడ్డుమీదయినా హాయిగా నడిచేయగలుగుతోంది. దానికి విశ్రాంతి కావాలనుకున్నపుడు బండిని తీసి పక్కన పెట్టేయవచ్చు. కుక్కపిల్ల సౌకర్యాన్ని బట్టి దాన్ని బిగించడం, వదులు చేయటం కూడా చేయవచ్చు.
పది అంగుళాల పొడవున్న బండిని తేలికపాటి బాల్ బేరింగ్స్‌తో తయారు చేశారు. మార్చి 28న రోడ్డుమీద గాయాలతో ఉన్న కుక్కపిల్లను ఇంటికి తెచ్చి వైద్యం చేయించిన వ్యక్తి, టామీ తన తమ్ముడితో సమానం అంటున్నాడు.