సాక్షి ప్రసారాలపై హైకోర్టులోనూ తొండివాదన చేసిన ప్రభుత్వం
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సాక్షి ప్రసారాల నిలిపివేతతో తమకెలాంటి సంబంధం లేదని ప్రభుత్వం వాదించింది. సాక్షి ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఎంఎస్‌ఓలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది. ఇది సాక్షికి, ఎంఎస్‌వోలకు సంబంధించిన విషయం అని తెలిపింది. పిటిషన్‌పై కౌంటర్‌దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే సాక్షి ప్రసారాల నిలిపివేతతో తమకు సంబంధం […]

ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సాక్షి ప్రసారాల నిలిపివేతతో తమకెలాంటి సంబంధం లేదని ప్రభుత్వం వాదించింది. సాక్షి ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఎంఎస్‌ఓలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది. ఇది సాక్షికి, ఎంఎస్‌వోలకు సంబంధించిన విషయం అని తెలిపింది.
పిటిషన్‌పై కౌంటర్‌దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే సాక్షి ప్రసారాల నిలిపివేతతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పడం పచ్చిఅబద్దమని పిటిషనర్లు చెబుతున్నారు. స్వయంగా హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు మరో మంత్రి కూడా స్వయంగా తామే సాక్షి ప్రసారాలను నిలిపివేశామని మీడియాతోనే చెప్పారు.
ముద్రగడ దీక్ష నేపథ్యంలోనే ప్రసారాలను ఆపివేయించామని వెల్లడించారు. ఇప్పుడు మాత్రం ప్రసారాల నిలిపివేతతో తమకు సంబంధం లేదని హైకోర్టు ముందు ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. హైకోర్టుకు కూడా ప్రభుత్వం అబద్దాలే చెబుతున్నట్టుగా ఉంది.
Click on Image to Read: