రాజన్ వ్యాఖ్యలు... మోదీకి చురకలా?
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి మాటల బాంబులు పేల్చారు. తన సున్నితమైన వ్యాఖ్యలతో మోదీ సర్కారుకు పదునైన పంచ్‌లు ఇచ్చారు. వ్యాపారులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతోనే బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడానికి కారణమవుతోందని ఆయన సంచలన ప్రకటన చేశారు. మీ సర్కారు తీరు వల్లే ప్రజలపై వడ్డీ రేట్ల భారం పెరుగుతోందని నేరుగానే విమర్శించారు. ఈ విమర్శలకు ప్రజలు, ప్రతిపక్షాలు లలిత్ మోదీ, విజయ్ మాల్యా.. పేర్లను గుర్తుకు తెస్తున్నాయి. వారు దేశం విడిచి […]
BY sarvi21 Jun 2016 5:37 AM IST
X
sarvi Updated On: 21 Jun 2016 7:04 AM IST
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి మాటల బాంబులు పేల్చారు. తన సున్నితమైన వ్యాఖ్యలతో మోదీ సర్కారుకు పదునైన పంచ్‌లు ఇచ్చారు. వ్యాపారులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతోనే బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడానికి కారణమవుతోందని ఆయన సంచలన ప్రకటన చేశారు. మీ సర్కారు తీరు వల్లే ప్రజలపై వడ్డీ రేట్ల భారం పెరుగుతోందని నేరుగానే విమర్శించారు. ఈ విమర్శలకు ప్రజలు, ప్రతిపక్షాలు లలిత్ మోదీ, విజయ్ మాల్యా.. పేర్లను గుర్తుకు తెస్తున్నాయి. వారు దేశం విడిచి వెళ్లేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సహకరిచిన వైనాన్ని మరోసారి నెమరువేసుకుంటున్నారు. వేలాది కోట్ల రూపాయల ప్రజల, ప్రభుత్వ సొమ్మును రుణాల రూపంలో తీసుకుని ఎగ్గొట్టడం, సరిగా చెల్లించని వారి వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆయన కుండబద్దలు కొట్టారు. వడ్డీలు తగ్గించాలని కోరుతున్న పారిశ్రామిక వేత్తలు.. తాము తీసుకున్న రుణాల రికవరీలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వడ్డీ రేట్లు పెంచిన ప్రతిసారీ, పేద, మధ్యతరగతి, ఉద్యోగులు, పెన్షనర్లపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పారిశ్రామిక వేత్తలు సకాలంలో రుణాలు చెల్లిస్తే.. వడ్డీ రేట్లు తగ్గించే వాళ్లమన్నారు. ఆ సమయంలో ఆర్బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. పలువురు లేఖలు రాసేవారని గుర్తుకు చేసుకున్నారు.
అసలేంటి వివాదం?
గతకొంతకాలంగా మోదీ సర్కారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ని ఇబ్బందులు పెడుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. మేక్ ఇన్ ఇండియాతో భారత్‌లో మరో పారిశ్రామిక విప్లవానికి నాందిపలికింది మోదీ సర్కారు. అయితే, చైనా పారిశ్రామిక విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మేక్ ఇండియాను ఫాలో అయితే, ప్రమాదమని రాజన్ హెచ్చరించారు. అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసముందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తెచ్చి పెట్టే ప్రమాదముందని బహిరంగంగానే హెచ్చరించారు. దీంతో మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంపై పలు సందేహాలు మొదలయ్యాయి. తరువాత కాలంలో రాజన్ మోదీ సర్కారుపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆయనపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని, అందుకే ఆ తరువాత కాలంలో మోదీ సంక్షేమ పథకాలపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదన్న విమర్శలు వచ్చాయి.
ఈ డిసెంబరుతో రాజన్ పదవీకాలం ముగుస్తుంది. ఇదే సమయంలో మోదీ సర్కారులో అత్యంత వాగ్దాటి గలిగిన సుబ్రమణ్య స్వామి ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన విదేశీ గూఢచారి అని అభివర్ణించారు. స్వామి వరుస ఆరోపణలతో రాజన్ విసుగెత్తిపోయారు. అందుకే, తాను రెండో దఫా పోటీలో ఉండటం లేదని ప్రకటించారు. దీనికి కారణం స్వామి చేసిన ఆరోపణలేనని అంతా అనుకుంటున్నారు. బ్యాంకుల వద్ద వేలకు వేలు రుణాలు తీసుకొని, సరైన సమయంలో చెల్లించకుండా.. బ్యాంకులను ఇబ్బందులు పెడుతున్న పెద్దమనుషుల తీరు, వారికి సహకరించిన ప్రభుత్వ పెద్దల పేర్లను రాజన్ పరోక్షంగా గుర్తుకు తెచ్చి మరోసారి మోదీ సర్కారును ఇరుకునపెట్టారు.
Next Story