రైతును చీల్చిచెండాడిన ఎలుగుబంటి!
చీల్చిచెండాడటం.. అన్న మాట విన్నారే కానీ ఎప్పుడైనా చూశారా? పొలం వద్దకు వెళ్లిన ఓ రైతుపై దాడిచేసిన ఎలుగుబంటి అతని శరీరాన్ని చీల్చి చెండాడింది. దాని కసితీరా.. ముక్కలు ముక్కలు చేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన పాలమూరు జిల్లా అచ్చంపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గంపన్ పల్లికి చెందిన బోడ్యానాయక్ (50) రైతు. రోజులాగే సోమవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ అప్పటికే బిగించిన ఉచ్చులో ఓ ఎలుగుబంటి చిక్కుకుని […]
BY sarvi21 Jun 2016 12:32 AM IST
X
sarvi Updated On: 21 Jun 2016 8:19 AM IST
చీల్చిచెండాడటం.. అన్న మాట విన్నారే కానీ ఎప్పుడైనా చూశారా? పొలం వద్దకు వెళ్లిన ఓ రైతుపై దాడిచేసిన ఎలుగుబంటి అతని శరీరాన్ని చీల్చి చెండాడింది. దాని కసితీరా.. ముక్కలు ముక్కలు చేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన పాలమూరు జిల్లా అచ్చంపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గంపన్ పల్లికి చెందిన బోడ్యానాయక్ (50) రైతు. రోజులాగే సోమవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ అప్పటికే బిగించిన ఉచ్చులో ఓ ఎలుగుబంటి చిక్కుకుని ఉంది. దాన్నుంచి బయటపడలేక.. విపరీతమైన కోపంతో వెర్రెత్తి ఉంది. ఉచ్చులో పడిన జంతువు నల్లగా ఉండటంతో అది అడవి పందేమోనని బోడ్యా పొరపాటుపడ్డాడు. మరికాస్త దగ్గరికి వెళ్లాడు. అయితే, అప్పటికే కోపంతో పిచ్చెక్కి ఉన్న ఎలుగుబంటి ఆ రైతుపై విచక్షణా రహితంగా దాడి చేసింది. బలమైన పంజాలు, వాడి అయిన దంతాలతో అతని శరీరాన్ని గుడ్డపేలికల్లా చీల్చిచెండాడింది. దీంతో ఆ రైతు అక్కడే ప్రాణాలు వదిలాడు.
గ్రామస్థుల కంటతడి
విషయం తెలుసుకున్న గ్రామస్థులు బోడ్యా శరీరాన్ని ఎలుగుబంటి నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. కానీ, కోపం మీద ఉన్న ఎలుగుబంటి వారిని ఎవరినీ దగ్గరికి రానీయలేదు. కోపంతో బోడ్యా శరీరాన్ని మరింత ఛిద్రం చేయడం ప్రారంభించింది.ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. తమ ముందు తిరిగిన రైతుకు ఎంత కష్టం వచ్చిందనుకుని విలపించారు. వెంటనే తేరుకుని హైదరాబాద్ జూ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన బయల్దేరి గ్రామానికి చేరుకున్నారు. ఎలుగుబంటికి మత్తు ఇంజెక్షన్లు (ట్రాంక్విలైజర్లు) ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి మత్తులోకి జారుకుంది. దీంతో అప్పుడుగానీ బోడ్యా శరీరాన్ని తీసుకోవడం సాధ్యపడలేదు.
Next Story