అంబటి ఆక్రోశంలో అర్థముంది...
మొన్నటి ఎన్నికల్లో ఏకంగా రూ.11.5కోట్లు ఖర్చుపెట్టానని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చెప్పడం సంచలనంగా మారింది. స్పీకర్ వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో పెద్దెత్తున దాడి జరుగుతోంది. అటు వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కోడెలపై మండిపడ్డారు. వెంటనే శివప్రసాదరావుపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్లతో కాదు నోట్లతోనే గెలుపు సాధించానని కోడెల స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి ఈసీ సుమోటోగా స్పందించాలన్నారు. కోడెల వ్యాఖ్యలపై నేరుగా ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై […]
మొన్నటి ఎన్నికల్లో ఏకంగా రూ.11.5కోట్లు ఖర్చుపెట్టానని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చెప్పడం సంచలనంగా మారింది. స్పీకర్ వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో పెద్దెత్తున దాడి జరుగుతోంది. అటు వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కోడెలపై మండిపడ్డారు. వెంటనే శివప్రసాదరావుపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్లతో కాదు నోట్లతోనే గెలుపు సాధించానని కోడెల స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి ఈసీ సుమోటోగా స్పందించాలన్నారు.
కోడెల వ్యాఖ్యలపై నేరుగా ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఈసీ చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. 11.5 కోట్లు ఖర్చు పెట్టిన కోడెల 1100 కోట్లు సంపాదించడమే లక్ష్యంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజవకర్గాల్లో కోడెల కుమారుడు, కుమార్తె విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
అంబటి ఈ రేంజ్లో కోడెలపై విరుచుకుపడడం వెనుక అర్థముంది. మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ తరపున అంబటిరాంబాబు… కోడెలపై పోటీ చేశారు. అంబటి విజయం దాదాపు ఖాయమనుకున్నా ఆఖరి నిమిషాల్లో ఫలితం తారుమారైంది. కేవలం వెయ్యికి పైచిలుకు ఓట్లతో కోడెల శివప్రసాదరావు గట్టెక్కేశారు. కోడెల శివప్రసాదరావు భారీగా డబ్బులు ఖర్చు చేయడం వల్లే కనీసం స్వల్పమెజారిటీతోనైనా విజయం సాధించారన్న భావన ఉంది. డబ్బు విషయంలో కోడెలతో అంబటి పోటీ పడలేకపోవడం వల్లే ఓడిపోయారని కూడా చెబుతుంటారు. పైగా గెలిచిన కొద్దిరోజులకే అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తాఫాపై కోడెల వర్గీయులు భౌతికదాడులు కూడా చేశారు.
Click on Image to Read: