నితీశ్ సవాలుతో చిక్కుల్లో మోదీ!
వివిధ రోగాలను నయం చేయడంలో యోగాకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ తరుణంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో మోదీ చిక్కుల్లో పడ్డారు. తరచుగా మోదీపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే నితీశ్ ఇప్పుడు మోదీకి పెద్ద సవాలే విసిరారు. యోగా చేయాలంటే.. ఎలాంటి మద్యం సేవించకూడదు. దేశవ్యాప్తంగా యోగాను విజయవంతంగా అమలు చేయాలనుకుంటున్న మోదీ గారు భారతదేశమంతటా యోగా అమలుకు ముందు మందుబాబులతో మద్యం మానిపించగలరా? అని సవాలు విసిరారు. దేశవ్యాప్తంగా యోగాడే […]
BY sarvi20 Jun 2016 4:21 AM IST
X
sarvi Updated On: 20 Jun 2016 6:15 AM IST
వివిధ రోగాలను నయం చేయడంలో యోగాకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ తరుణంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో మోదీ చిక్కుల్లో పడ్డారు. తరచుగా మోదీపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే నితీశ్ ఇప్పుడు మోదీకి పెద్ద సవాలే విసిరారు. యోగా చేయాలంటే.. ఎలాంటి మద్యం సేవించకూడదు. దేశవ్యాప్తంగా యోగాను విజయవంతంగా అమలు చేయాలనుకుంటున్న మోదీ గారు భారతదేశమంతటా యోగా అమలుకు ముందు మందుబాబులతో మద్యం మానిపించగలరా? అని సవాలు విసిరారు.
దేశవ్యాప్తంగా యోగాడే సంబరాలు చేసుకోని జబ్బలు చరుచుకోవడం ముఖ్యం కాదని, దేశంలో పలు అనర్థాలకు కారణమవుతోన్న మందు రాక్షసిని పారదోలేందుకు కృషి చేయగలరా? అని సవాలు విసిరారు. తాను ఇప్పటికే బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయించి చూపించానని, చేతనైతే తనలాగే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయించగలరా? అని బహిరంగ సవాలు విసిరారు. బిహార్‌లో కొంతకాలంగా మద్యాన్ని నిషేధించారు. ఒక్క ఆర్మీ క్యాంపుల్లో తప్ప ఎక్కడా మందు దొరకడం లేదు. ఈ నిషేధం అమల్లోకి వచ్చిన కొద్దివారాల్లో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సంఖ్యాపరంగా చెప్పాలంటే.. దాదాపు 30 శాతం నేరాల నమోదులో క్షీణత రికార్డవుతోంది. ఇది ముమ్మాటికీ నితీశ్ విజయమని జాతీయ మీడియా ఇప్పటికే ప్రశంసలు కురిపిస్తోంది.
నితీశ్ చేసిన వ్యాఖ్యలతో మోదీ, ఆయన ప్రభుత్వం చిక్కుల్లో పడింది. బిహార్ సీఎం చేసిన వ్యాఖ్యల్లో నూటికి 100 శాతం నిజముంది. దేశమంతా యోగా చేయిస్తే.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే మద్యాన్ని నిర్మూలిస్తే.. మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. రెండోసారి అంతర్జాతీయంగా యోగాను విజయవంతంగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న మోదీజీకి నితీశ్ చురకలు అంటించడం ఆయనకు, ఆయన అనుచర గణానికి మింగుడుపడటం లేదు.
Next Story