రోజా లేఖ ఇవ్వలేదా?
అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ సమయంలో తాను ఎంతో ఓర్పుగా ఉంటున్నానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నానన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రికార్డులు చూస్తే ఏ పక్షానికి ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఇచ్చానో అర్థమవుతుందన్నారు. రోజాపై ఏడాది సస్పెన్షన్ నిర్ణయం తాను తీసుకున్నది కాదని చెప్పారు. సస్సెన్షన్ నిర్ణయం సభ తీసుకుందని యనమల చెప్పారని… కాబట్టి సభ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు. అందుకే రోజాను సస్పెండ్ చేశామన్నారు. ఆమె […]
అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ సమయంలో తాను ఎంతో ఓర్పుగా ఉంటున్నానని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నానన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రికార్డులు చూస్తే ఏ పక్షానికి ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఇచ్చానో అర్థమవుతుందన్నారు. రోజాపై ఏడాది సస్పెన్షన్ నిర్ణయం తాను తీసుకున్నది కాదని చెప్పారు. సస్సెన్షన్ నిర్ణయం సభ తీసుకుందని యనమల చెప్పారని… కాబట్టి సభ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు. అందుకే రోజాను సస్పెండ్ చేశామన్నారు. ఆమె మాట్లాడిన తీరు, బాడీ లాంగ్వేజ్ సరిగా లేవన్నారు. కోర్టు కూడా ఈ విషయమే చెప్పి క్షమాపణ చెబితే స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారని చెప్పిందన్నారు. కానీ రోజా ఇప్పటి వరకు క్షమాపణ లేఖ ఇవ్వలేదన్నారు. క్షమాపణ చెప్పి ఉంటే తప్పనిసరిగా మన్నించేవాడినన్నారు.
తన కొడుకుపై వస్తున్న ఆరోపణల గురించికూడా కోడెల స్పందించారు. స్పీకర్‌గా తనకు కొన్నిపరిమితులుంటాయని.. కానీ వాటిని దాటి చేసే అవకాశం తన కుమారుడికి ఉంటుందన్నారు. అందుకే నియోజకవర్గంలో కొన్ని వ్యవహారాలను చూస్తున్నారని చెప్పారు. కమిషన్ తీసుకోకుండా తన కుమారుడు శివరామకృష్ణ పనిచేయడం లేదన్న ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. తనకుమారుడి ఎదుగుదల చూసి ఓర్వలేక ప్రతిపక్షం, అధికారపక్షానికి చెందిన వారు కూడా ఆరోపణలు చేస్తుండవచ్చన్నారు.
Click on Image to Read: