వెండి కంచాలు తెప్పించారు...ఏడు లక్షలతో విందు ఇచ్చారు!
ఆర్‌టిఐ చట్టం వచ్చాక చాలా విషయాల్లో ప్రజల కళ్లు తెరుచుకుంటున్నాయి. అవునా… అనిపించే నిజాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకమొకటి అలాగే బయటకు వచ్చింది. గత ఏప్రిల్ నెలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, వారి సతీమణులకు ఇండోర్‌లో ఘనంగా విందునిచ్చింది. ఎంత ఘనమంటే ఆ విందుకు ఏడు లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. 3.57 లక్షలు ఖర్చుపెట్టి వెండికంచాలు తెప్పించారు. ఇక భోజనం, టీ, […]
ఆర్టిఐ చట్టం వచ్చాక చాలా విషయాల్లో ప్రజల కళ్లు తెరుచుకుంటున్నాయి. అవునా… అనిపించే నిజాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకమొకటి అలాగే బయటకు వచ్చింది. గత ఏప్రిల్ నెలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, వారి సతీమణులకు ఇండోర్‌లో ఘనంగా విందునిచ్చింది. ఎంత ఘనమంటే ఆ విందుకు ఏడు లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. 3.57 లక్షలు ఖర్చుపెట్టి వెండికంచాలు తెప్పించారు. ఇక భోజనం, టీ, బహుమతులకోసం 3.37లక్షలు ఖర్చుచేశారు. స్వయంగా ముఖ్యమంత్రే విందు ఏర్పాట్లు భారీగా ఉండాలని చెప్పటంతో అధికారులు అంత భారీగానూ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు.
సామాజిక కార్యకర్త అజయ్ దూబే సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను సేకరించి మీడియాకు వెల్లడించారు. అతిథులకు విందు ఇవ్వటంలో తప్పులేదని, అయితే ప్రజాధనాన్ని ఇంతగా దుర్వినియోగం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
Click on Image to Read: