సెల్ఫీ...చర్మం పాలిట కిల్...ఫీ!
ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా…ఏమీ చేయకుండా ఊరికే ఉన్నా… సెల్ఫీ దిగేస్తే ఓ పనయిపోతుంది బాబూ…. అనుకుంటున్న యువతరం ఆలోచించాల్సిన విషయమే ఇది. ఫోన్ ని మొహానికి దగ్గరగా పెట్టుకుని అదేపనిగా భిన్న పోజులతో సెల్ఫీలు దిగేవారికి చర్మవ్యాధుల నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ కారణంగా చర్మానికి హాని కలుగుతుందని, చర్మం ముడతలు పడుతుందని, వయసుమీరిన లక్షణాలు కనబడతాయని వీరు చెబుతున్నారు. బ్రిటన్కు చెందిన వైద్యులు ఈ వివరాలు వెల్లడించారు. ఫోన్ని […]
ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా…ఏమీ చేయకుండా ఊరికే ఉన్నా… సెల్ఫీ దిగేస్తే ఓ పనయిపోతుంది బాబూ…. అనుకుంటున్న యువతరం ఆలోచించాల్సిన విషయమే ఇది. ఫోన్ ని మొహానికి దగ్గరగా పెట్టుకుని అదేపనిగా భిన్న పోజులతో సెల్ఫీలు దిగేవారికి చర్మవ్యాధుల నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ కారణంగా చర్మానికి హాని కలుగుతుందని, చర్మం ముడతలు పడుతుందని, వయసుమీరిన లక్షణాలు కనబడతాయని వీరు చెబుతున్నారు. బ్రిటన్కు చెందిన వైద్యులు ఈ వివరాలు వెల్లడించారు. ఫోన్ని చేత్తో పట్టుకుని సెల్ఫీకోసం ఏ వైపు చూస్తారో ఆ వైపు ముఖ చర్మం హానికి గురయ్యే అవకాశం ఉందని, ముఖ ఆకృతి చెదిరిపోయే ప్రమాదముందని వారు అంటున్నారు.
ఫోన్ స్క్రీన్లనుండి వెలువడే నీలం రంగు కాంతి చర్మానికి హాని కలిగిస్తుందని, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ కారణంగా చర్మం డిఎన్ఎ దెబ్బతింటుందంటున్నారు. చర్మానికి కలుగుతున్న హానిని వెంటనే గుర్తించడం కూడా కష్టమని చెబుతున్నారు. సెల్ఫీలు దిగి సోషల్మీడియాలో పుంఖాను పుంఖానులుగా పోస్ట్ చేస్తున్నవారు ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకుని తీరాలి.