పాక్‌లో జిహాద్ యూనివర్శిటీ...ప్రభుత్వం నుండి ఆర్థిక తోడ్పాటు!
జిహాద్ యూనివర్శిటీగా పేరుపొందిన ఒక మదర్సాకు పాకిస్తాన్‌లోకి ఒక రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయిలను కేటాయించింది. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఈ మదర్సా ఉంది. ఆ రాష్ట్ర మంత్రి షా ఫర్మన్ ఈ విషయాన్ని అసెంబ్లీ లో ప్రకటిస్తూ, దారుల్ ఉలూమ్ హక్కానియా నౌషెరా అనే ఈ మదర్సాకు సాంవత్సరిక వ్యయానికి గాను 30 కోట్ల రూపాయిలను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. ఖైబర్ రాష్ట్రంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్‌సాఫ్ (పిటిఐ) అధికారంలో ఉంది. […]
జిహాద్ యూనివర్శిటీగా పేరుపొందిన ఒక మదర్సాకు పాకిస్తాన్‌లోకి ఒక రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయిలను కేటాయించింది. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఈ మదర్సా ఉంది. ఆ రాష్ట్ర మంత్రి షా ఫర్మన్ ఈ విషయాన్ని అసెంబ్లీ లో ప్రకటిస్తూ, దారుల్ ఉలూమ్ హక్కానియా నౌషెరా అనే ఈ మదర్సాకు సాంవత్సరిక వ్యయానికి గాను 30 కోట్ల రూపాయిలను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. ఖైబర్ రాష్ట్రంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్‌సాఫ్ (పిటిఐ) అధికారంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ సంస్థ మాజీ చీఫ్ ముల్లా ఒమర్‌తో పాటు తాలిబన్ అగ్రశ్రేణి నాయకులంతా పాక్ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో నడుస్తున్న ఈ మదర్సా నుండి వచ్చినవారే కావటం గమనార్హం. ముల్లాకు ఈ విద్యాసంస్థ డాక్టరేట్‌ని సైతం ప్రదానం చేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట ప్రభుత్వం మత సంస్థలపై దాడులు చేయబోవటం లేదని, పైగా వాటికి ఆర్థిక సహాయమిచ్చి ప్రోత్సహించదలచుకున్నదని రాష్ట్రమంత్రి వెల్లడించారు.
Click on Image to Read: