Telugu Global
Others

సినిమా ఒక్కటే... దర్శకులు మాత్రం ఐదుగురు...

సాధారణంగా సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండొచ్చు. ఇక ఇద్దరు హీరోయిన్లు ఉండడం చాలా కామన్ అయిపోయింది. కానీ ఒక సినిమాకు ఒకే దర్శకుడు ఉంటాడు. అలా ఉండాలి కూడా. లేదంటే సినిమా బ్యాలెన్స్ తప్పిపోతుంది. కానీ కోలీవుడ్ లో ఈ ట్రెండ్ ను తిరగరాస్తున్నాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ప్రస్తుతం తను తీస్తున్న ఓ సినిమా కోసం తనతో పాటు మరో ఐదుగురు దర్శకుల్ని ట్రాక్ లోకి తీసుకున్నాడు. నిజానికి వాళ్లను అసిస్టెంట్ డైరక్టర్లుగా వాడుకోవచ్చు. […]

సినిమా ఒక్కటే... దర్శకులు మాత్రం ఐదుగురు...
X
సాధారణంగా సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండొచ్చు. ఇక ఇద్దరు హీరోయిన్లు ఉండడం చాలా కామన్ అయిపోయింది. కానీ ఒక సినిమాకు ఒకే దర్శకుడు ఉంటాడు. అలా ఉండాలి కూడా. లేదంటే సినిమా బ్యాలెన్స్ తప్పిపోతుంది. కానీ కోలీవుడ్ లో ఈ ట్రెండ్ ను తిరగరాస్తున్నాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ప్రస్తుతం తను తీస్తున్న ఓ సినిమా కోసం తనతో పాటు మరో ఐదుగురు దర్శకుల్ని ట్రాక్ లోకి తీసుకున్నాడు. నిజానికి వాళ్లను అసిస్టెంట్ డైరక్టర్లుగా వాడుకోవచ్చు. కానీ డైరక్టర్ హోదా ఇచ్చి మరీ వాళ్లకు పని అప్పగించాడు. ప్రస్తుతం జై హీరోగా తమిళ్ లో ఓ సినిమా చేస్తున్నాడు వెంకట్ ప్రభు. 2007లో వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమాకు సీక్వెల్ గా ఇది వస్తుంది. దీని పేరు చెన్నై 600028. ఈ సినిమా క్లయిమాక్స్ షూటింగ్ కోసమే ఐదుగురు దర్శకుల్ని నియమించుకున్నాడు. వాళ్ల పేర్లు వెంకటేష్ రామకృష్ణన్, శరవణ రాజన్, శ్రీ పతి, చంద్రు, ఆర్ నాగేంద్రన్. నిజానికి వీళ్లంతా ఒకప్పుడు వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్ డైరక్టర్లుగా పనిచేసిన వాళ్లే. కాకపోతే ఇప్పుడు దర్శకులుగా చలామణి అవుతున్నారు. తన సినిమా కోసం వీళ్లందర్నీ పిలిచాడు. ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ అప్పగించాడు. ప్రతి ఒక్కరికి ఓ యూనిట్ ఇచ్చాడు. సినిమా క్లయిమాక్స్ ను సింగిల్ డే లో పూర్తిచేయాలనే ఆలోచనతోనే వెంకట్ ప్రభు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతడి నిర్ణయం ఎలాంటి ఫలితాన్నిస్తుందో సినిమా విడుదల తర్వాత చూడాలి.
First Published:  20 Jun 2016 1:08 PM IST
Next Story