స్విస్ చాలెంజ్ దెబ్బకు కేబినెట్ వాయిదా
ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ టక్కర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంపై అధికారుల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తోంది. సింగపూర్ కంపెనీలతో నేరుగా ఫోన్‌లో చర్చలు జరిగిన చంద్రబాబు… 1690 ఎకరాలను కంపెనీలకు అప్పగించడంతో పాటు ప్రాజెక్ట్‌లో సింగపూర్ కంపెనీలకు 52 శాతం అప్పగించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు రెడీ చేసిన ఫైల్‌పై విచిత్రంగా చంద్రబాబే ముందు సంతకం చేసేశారు. ఆ […]
ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ టక్కర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంపై అధికారుల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తోంది. సింగపూర్ కంపెనీలతో నేరుగా ఫోన్‌లో చర్చలు జరిగిన చంద్రబాబు… 1690 ఎకరాలను కంపెనీలకు అప్పగించడంతో పాటు ప్రాజెక్ట్‌లో సింగపూర్ కంపెనీలకు 52 శాతం అప్పగించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు రెడీ చేసిన ఫైల్‌పై విచిత్రంగా చంద్రబాబే ముందు సంతకం చేసేశారు. ఆ ఫైల్‌ను ఆమోదం కోసం సీఎస్ వద్దకు పంపారు. ఈ పరిణామం అధికార వర్గాల్లో కలకలం రేపింది.
చంద్రబాబు ముందే సంతకం చేసి ఫైల్‌ను పంపడం ద్వారా సీఎస్‌ను కార్నర్ చేసినట్టు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎత్తును సీఎస్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫైల్‌ను సీఆర్‌డీఏ అధికారులు తన వద్దకు తీసుకురాగా సీఎం సంతకం చేసిన తర్వాత తన వద్దకు పైల్ ఎందుకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నేరుగా కేబినెట్‌లోనే ఆమోదం తెలుపుకోండి అని నిరసన తెలిపారు.స్విస్ చాలెంజ్లో అనేక ఉల్లంఘనలు ఉన్నాయని…ఫైల్‌పై సంతకం చేస్తే ఇరుక్కుంటామన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. చివరకు సీఎస్ ఈ ఫైల్‌పై న్యాయ సలహా కోరారు. ఈ పరిణామంతో ఫైల్ క్లియర్ అవడం ఆలస్యమవుతోంది.
ఇప్పటికే ఈ ఫైల్‌కోసం కేబినెట్ భేటీ మూడుసార్లు వాయిదా పడింది. ఈనెల 15న తొలుత కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. అనంతరం దాన్ని 22కు వాయిదా వేశారు. అయినా సీఎస్ నుంచి ఫైల్ రాకపోవడంతో ఈనెల 24కు కేబినెట్ భేటీని వాయిదా వేశారు. మొత్తం మీద అటు సీఎం, ఇటు సీఎస్ స్విస్ చాలెంజ్ విషయంలో పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా తనకు అనుకూలమైన కంపెనీలకు ప్రాజెక్ట్ కట్టబెట్టాలన్న పట్టుదలతో బాబు ఉన్నారు.
Click on Image to Read: