ఇంతలోనే ఎంత పనైపోయింది బాబు గారు...
”తమ్ముళ్లు…. ఎప్పుడూ పంటలతో కళకళలాడే గోదావరి జిల్లాల్లో కూడా పంటలు వేయలేమని రైతులు క్రాప్ హాలీడే ప్రకటించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. రైతులను నడ్డివిరిచింది. రైతులు పంటలు పండించలేమని చేతులెత్తేయడం అంటే అంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా తమ్ముళ్లూ… ” ఇది ఎన్నికలకు ముందు, ఇటీవల కొద్దిరోజుల ముందు వరకు చంద్రబాబు రైతులకు సంబంధించిన మీటింగ్‌ల్లో చెప్పిన డైలాగులు. ”నేను సీఎం అయ్యాక పరిస్థితిని మొత్తం చక్కదిద్దాను తమ్ముళ్లూ.. అదీ మన కమిట్‌మెంట్” అని కూడా చంద్రబాబు […]
”తమ్ముళ్లు…. ఎప్పుడూ పంటలతో కళకళలాడే గోదావరి జిల్లాల్లో కూడా పంటలు వేయలేమని రైతులు క్రాప్ హాలీడే ప్రకటించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. రైతులను నడ్డివిరిచింది. రైతులు పంటలు పండించలేమని చేతులెత్తేయడం అంటే అంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా తమ్ముళ్లూ… ” ఇది ఎన్నికలకు ముందు, ఇటీవల కొద్దిరోజుల ముందు వరకు చంద్రబాబు రైతులకు సంబంధించిన మీటింగ్‌ల్లో చెప్పిన డైలాగులు. ”నేను సీఎం అయ్యాక పరిస్థితిని మొత్తం చక్కదిద్దాను తమ్ముళ్లూ.. అదీ మన కమిట్‌మెంట్” అని కూడా చంద్రబాబు చెప్పేవారు. అయితే ఇంతలోనే చంద్రబాబుకు గోదావరి జిల్లాల రైతులు పెద్ద షాక్ ఇచ్చారు.
సాగులో ఎదురువుతున్న సమస్యల కారణంగా మరోసారి పంటవిరామం ప్రకటించే దిశగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ రైతులు సమాయత్తమవుతున్నారు. సకాలంలో సాగునీరు అందించలేకపోవడం, కాలువల ఆధునీకరణ పూర్తి కాకపోవడం, మద్దతు ధర లేకపోవడం వంటి కారణాలతో, ప్రభుత్వ వైఖరికి నిరసనగా క్రాప్ హాలీడే ప్రకటించాలని రైతులంతా సమావేశమై దాదాపు నిర్ణయం తీసుకున్నారు. 2011లో ఒకసారి కోనసీమ రైతాంగం పంటవిరామం ప్రకటించి, పొలాలను బీళ్లుగా వదిలేశారు. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇప్పుడు తిరిగి అదే హాలీడే వస్తుండడంతో టీడీపీ నేతల నోట మాట రావడం లేదు.
ఆరుగాలం శ్రమించి సాగుచేసినా గిట్టుబాటు ధర లేకపోవడం, మద్దతు ధర కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది పెట్టే నిబంధనలు మనోవ్యధకు గురి చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. విపరీతంగా పెరిగిపోయిన ఎరువుల ధరలు, కూలీల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే దిశగా రైతులు ముందుకెళ్తుననారు. కోనసీమలోని ముమ్మిడివరం మండలం అనాతవరం రైతాంగం ఖరీఫ్ సాగు చేయలేమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషయమై రైతులను చైతన్యపరచి, మరోసారి కోనసీమ అంతటా పంట విరామం ప్రకటించడానికి రైతు నేతలు ప్రచారం ప్రారంభించారు.
క్రాప్ హాలీడే ప్రకటనకు రైతులు మరిన్నికారణాలు కూడాచెబుతున్నారు. నీలం, హుద్ హుద్ తుపానుల నష్టపరిహారం ఇప్పటికీ అందలేదంటున్నారు. లాభసాటి ధర హామీని ప్రభుత్వం విస్మరించిందంటున్నారు. గతంలో పంట విరామం సమయంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కేంద్రం మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.200లు చెల్లిస్తామన్న హామీ ఇచ్చారు. అయినా అన్ని హామీలలాగే దాన్నీ గాలికి వదిలేశారు. మొత్తానికి కాంగ్రెస్ హయాంలో క్రాప్ హాలీడే ప్రకటిస్తే అది రాష్ట్రానికే అవమానం అన్న చంద్రబాబు ఇప్పటి పంటవిరామంపై ఏం చెబుతారో!.
Click on Image to Read: