హరీశ్ రావు మంచోడు కాదా... తిరుపతిలో మోకాళ్లపై ఎందుకు నడిచాడు?
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రిపై కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూనిర్వాసితుల సమస్యలపై వీహెచ్ మాట్లాడుతూ హరీష్‌పై ధ్వజమెత్తారు. ఇంతకాలం తాను హరీశ్ ను చాలా మంచివాడనుకున్నానని కానీ, ఆయన ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదని వాపోయాడు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న 4 గ్రామాల ప్రజలు ఆందోళనకు కాంగ్రెస్ మద్దతవ్వడాన్ని హరీశ్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. మీరు నాలుగు గ్రామాల ప్రజలను లేపితే.. నేను 400 […]
BY sarvi19 Jun 2016 3:38 AM IST
X
sarvi Updated On: 19 Jun 2016 8:34 AM IST
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రిపై కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూనిర్వాసితుల సమస్యలపై వీహెచ్ మాట్లాడుతూ హరీష్‌పై ధ్వజమెత్తారు. ఇంతకాలం తాను హరీశ్ ను చాలా మంచివాడనుకున్నానని కానీ, ఆయన ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదని వాపోయాడు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న 4 గ్రామాల ప్రజలు ఆందోళనకు కాంగ్రెస్ మద్దతవ్వడాన్ని హరీశ్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. మీరు నాలుగు గ్రామాల ప్రజలను లేపితే.. నేను 400 గ్రామాల ప్రజలను లేపుతానంటూ హరీశ్ కాంగ్రెస్ ను హెచ్చరించారు. పనిలోపనిగా సీఎం కేసీఆర్ పైనా విమర్శలు చేశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఇతర పార్టీల నుంచి వలసను ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు.
మొక్కు తీర్చుకున్న హరీశ్!
తెలంగాణ మంత్రి హరీశ్ రావు శనివారం తిరుమలకు వెళ్లారు. చాలాకాలం కింద మొక్కు తీర్చుకున్నారు. అలిపిరి వద్ద నుంచి హరీశ్ దంపతులు కాలిబాటన కొండపైకి వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద మంత్రి హరీశ్ రావు మోకాళ్లపై నుంచి నడవడం విశేషం. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కారులో కొండపైకి చేరుకున్నారు. శనివారం అక్కడే బసచేసిన వీరు ఆదివారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Next Story