జేసీకి కేంద్రమంత్రి పదవి? టీజీ దారిలోనేనా...
మరికొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ దాదాపు ఖాయమైన నేపథ్యంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై చర్చ మొదలైంది. మిత్రపక్షమైన టీడీపీకి మరొక బెర్త్ ఇవ్వాల్సిందిగా మోదీని అమిత్ షా కోరినట్టు ఒక పత్రిక కథనం. అందుకు మోదీ కూడా సానుకూలత వ్యక్తంచేశారట. ఈ నేపథ్యంలో టీడీపీ కోటాలో ఎవరికి దక్కవచ్చన్న దానిపై టీడీపీ నేతలు పలు అంచనాలు వేసుకుంటున్నారట. ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్రమంత్రులు కోస్తా, ఉత్తరాంధ్రకు చెందిన వారుకావడంతో ఇప్పుడు రాయలసీమ వారికి […]
మరికొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ దాదాపు ఖాయమైన నేపథ్యంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై చర్చ మొదలైంది. మిత్రపక్షమైన టీడీపీకి మరొక బెర్త్ ఇవ్వాల్సిందిగా మోదీని అమిత్ షా కోరినట్టు ఒక పత్రిక కథనం. అందుకు మోదీ కూడా సానుకూలత వ్యక్తంచేశారట. ఈ నేపథ్యంలో టీడీపీ కోటాలో ఎవరికి దక్కవచ్చన్న దానిపై టీడీపీ నేతలు పలు అంచనాలు వేసుకుంటున్నారట.
ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్రమంత్రులు కోస్తా, ఉత్తరాంధ్రకు చెందిన వారుకావడంతో ఇప్పుడు రాయలసీమ వారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు టీడీపీ నుంచి గెలిచారు. అయితే వీరిలో జేసీ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని సదరు ప్రతిక కథనం. ఒకవేళ బీసీ కోటాలో ఇవ్వాలనుకుంటే నిమ్మల కిష్టప్పకు చాన్స్ ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నట్టు సదరు పత్రిక కథనం. అయితే ..
జేసీకి మంత్రి పదవి ఏ ప్రతిపాదికన ఇస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. పైగా సామాజికవర్గపోరులో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలంతా జేసీకి ఏదో విధంగా వ్యతిరేకంగానే పని చేస్తున్నారు. పరిటాల రవి హత్య కేసులోనూ జేసీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే లేనిపోని సమస్యలు వస్తాయన్న భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ కొందరు టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ దక్కిన తీరును ప్రస్తావిస్తున్నారు.
టీజీ కూడా ఎన్నికల ముందే టీడీపీలోకి వచ్చారని…కానీ ఎంతో మంది టీడీపీ సీనియర్లు ప్రయత్నించినప్పటికీ చివరకు టీజీనే రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. టీజీకి రాజ్యసభ సభ దక్కడం వెనుక ఆయన వంద కోట్లు సమర్పించుకున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇదే ఈక్వేషన్ ఇప్పుడు కూడా పనిచేస్తే ఆర్థికంగా జేసీ దివాకర్ రెడ్డికి పోటీగా నిలబడే సామర్థ్యం రేస్‌లో ఉన్న మిగిలిన ఎంపీలకు లేదని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే కేంద్రమంత్రి పదవి ఎంత విలువ చేస్తుందో!.
Click on Image to Read: