వైసీపీ బృందాన్ని అడ్డుకున్న టీడీపీ... భయపడేది లేదన్న ధర్మాన
అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైసీపీ నేత ధర్మాన నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. పర్యటించడానికి వీలు లేదంటూ గొడవకు దిగారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు తోపులాటకు దిగారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకే వైసీపీ నేతలు పర్యటిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల వారు రహదారిపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగామారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. టీడీపీ నేతల తీరును ధర్మాన ప్రసాదరావు ఖండించారు. కోట్లాది […]
అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైసీపీ నేత ధర్మాన నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. పర్యటించడానికి వీలు లేదంటూ గొడవకు దిగారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు తోపులాటకు దిగారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకే వైసీపీ నేతలు పర్యటిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరువర్గాల వారు రహదారిపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగామారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
టీడీపీ నేతల తీరును ధర్మాన ప్రసాదరావు ఖండించారు. కోట్లాది రూపాయల విలువైన సత్రం భూములను కారుచౌకగా అమ్మేశారని ధర్మాన ఆరోపించారు. మంచి లక్ష్యం కోసం 150 ఏళ్ల క్రితం దాతలు భూములిస్తే వాటిని కాపాడాల్సిన సీఎం మాత్రం టీడీపీ నేతలకు కట్టబెట్టారని విమర్శించారు. మూడోవ్యక్తికి తెలియకుండానే భూములు అమ్మేశారని ఆక్షేపించారు. చెన్నైలో ఎకరం రూ.28 కోట్లు పలుకుతుంటే అక్కడ ఉన్న సత్రం భూములను కేవలం ఎకరం రూ. 5లక్షలకే ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీ నేతలకు ఇబ్బంది ఏమిటన్నారు.
ప్రజలకు నిజాలు తెలియకూడదనే తమను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తమ పర్యటనను అడ్డుకోవడం వల్ల ప్రజలకు మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఏర్పడిందన్నారు. ఇప్పటికే తాము చెన్నైలో పర్యటించి అనేక విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. ఈ భూదందాకు సంబంధించిన అన్ని వివరాలపై నివేదిక తయారు చేసి ప్రజలముందుంచుతామన్నారు. వాస్తవాలు వివరించే విషయంలో వైసీపీ ఎవరికీ భయపడదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి భూముల విక్రయాన్ని రద్దు చేయాలని ధర్మాన డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారందరినీ న్యాయస్థానం ముందు నిలబెడుతామన్నారు. దోషుల సంగతి తేలుస్తామన్నారు.
అమరావతిలోని సదావర్తి సత్రం భూములు చెన్నైలో ఉన్నాయి. వెయ్యి కోట్లు విలువ చేసే ఈ భూమిని మూడో కంటికి తెలియకుండా కేవలం 22 కోట్లకు టీడీపీ నేతలు దక్కించుకున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ , ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు కలిసి స్వామి భూములను స్వాహా చేసేశారు.
Click on Image to Read: