చిరంజీవి 150వ సినిమాలో మరో హీరోయిన్
చిరంజీవి 150వ సినిమాలో మొదట నయనతారను తీసుకోవాలని అనుకున్నప్పటికీ… పైకి చెప్పలేని కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మరికొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ… తాజాగా మాత్రం అనుష్క పేరు బాగా వినిపిస్తోంది. చిరంజీవి 150వ సినిమాలో అనుష్క గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోతున్న టైమ్ లో మరో హాట్ భామ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ ముద్దుగుమ్మ పేరే పరిణీతి చోప్రా. అవును… చిరు 150వ సినిమా కోసం […]
BY sarvi19 Jun 2016 3:50 PM IST
X
sarvi Updated On: 19 Jun 2016 3:51 PM IST
చిరంజీవి 150వ సినిమాలో మొదట నయనతారను తీసుకోవాలని అనుకున్నప్పటికీ… పైకి చెప్పలేని కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత మరికొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ… తాజాగా మాత్రం అనుష్క పేరు బాగా వినిపిస్తోంది. చిరంజీవి 150వ సినిమాలో అనుష్క గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోతున్న టైమ్ లో మరో హాట్ భామ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ ముద్దుగుమ్మ పేరే పరిణీతి చోప్రా. అవును… చిరు 150వ సినిమా కోసం పరిణీతి చోప్రాను కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా ఇప్పటికే తెలుగులో ఓ సినిమా ఒప్పుకుంది. మహేష్-మురుగదాస్ మూవీలో నటించడానికి అంగీకరించింది. తెలుగు కూడా కొంచెంకొంచెం నేర్చుకుంటోంది. ఇప్పుడా భామను తమ సినిమాలోకి కూడా తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడట. ప్రస్తుతం ఇదే అంశంపై పరిణీతితో చర్చలు జరుపుతున్నారట. బాలీవుడ్ లో అవకాశాలు అడుగంటిన వేళ… పరిణీతి కూడా చిరంజీవి ఆఫర్ గురించి ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరోవైపు పరిణీతితో పాటు దీపిక పదుకోన్ ను కూడా ప్రయత్నించినప్పటికీ… చిరు సరసన నటించడానికి పొడుగుకాళ్ల సుందరి అంగీకరించలేదట.
Click on Image to Read:
Next Story