వీహెచ్ కామెంట్: నవ్వులే నవ్వులు!
కొందరుంటారు.. వారు నోరు తెరిస్తే… సంచలనాలు.. పార్టీ ఆదేశాలో.. లేకుంటే వ్యక్తిగత రాజకీయ కక్షలోగానీ.. సంచలన ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈక్రమంలో వారు ఒక్కోసారి భంగపాటుకు గురవుతుంటారు కూడా. ఇలాంటి కోవకే చెందుతారు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు. ఇంతకీ ఇప్పుడు హనుమంతన్న ఏం కామెంట్లు చేశారు? ఆ కామెంట్లలో అంత హాస్యం ఏముంది? అనేగా మీ ప్రశ్న అయితే. ఇది మీరు తప్పకుండా చదవాల్సిందే! ఇటీవల నల్లగొండ […]
BY sarvi18 Jun 2016 5:37 AM IST
X
sarvi Updated On: 18 Jun 2016 8:29 AM IST
కొందరుంటారు.. వారు నోరు తెరిస్తే… సంచలనాలు.. పార్టీ ఆదేశాలో.. లేకుంటే వ్యక్తిగత రాజకీయ కక్షలోగానీ.. సంచలన ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈక్రమంలో వారు ఒక్కోసారి భంగపాటుకు గురవుతుంటారు కూడా. ఇలాంటి కోవకే చెందుతారు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు. ఇంతకీ ఇప్పుడు హనుమంతన్న ఏం కామెంట్లు చేశారు? ఆ కామెంట్లలో అంత హాస్యం ఏముంది? అనేగా మీ ప్రశ్న అయితే. ఇది మీరు తప్పకుండా చదవాల్సిందే!
ఇటీవల నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ), ఎమ్మెల్యే భాస్కర్ రావు (మిర్యాలగూడ) టీఆర్ ఎస్‌లో చేరిన విషయం విదితమే. వారిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఆ సందర్భంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టి తెలంగాణలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు చంద్రబాబు- తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిసి కుట్రపన్నారని తెలిపారు. ఈవ్యాఖ్యలు రెండు రాష్ర్టాల్లో పెనుదుమారాన్నే లేపాయి. ఓటుకునోటు కేసు నెమ్మదించిన తరువాత.. కేసీఆర్ ఇటీవలి కాలంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబుపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. వీటిని ఆయాపార్టీలు ఎక్కడికక్కడ ఖండించాయి. వీటిపై తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అంతేనా, ప్రజలకు జనరంజకమైన పాలన అందించాలని హితవుపలికారు. రైతు, ప్రజల, ప్రాజెక్టుల విషయంలో సమన్యాయం పాటించాలని సూచించారు. లేకుంటే తమ పార్టీ ఆయా సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. అయితే.. ఈ కామెంట్లు విన్న గులాబీ నేతలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఒక్కసారైనా ప్రజాప్రతినిధిగా గెలవలేని వీహెచ్‌కు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ దండిగా ఉన్న అంబర్ పేట నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వీహెచ్ పోటీ చేసి ఎందుకు గెలవలేకపోయారని గుర్తు చేశారు. వీహెచ్ గారు.. సంచలన కామెంట్లకు చిరునామా అని తెలుసుకో.. సంచలన జోకులకు కూడా ఆయనకు ఆయనేసాటి అని మరోసారి నిరూపించుకున్నారని నవ్వుకుంటున్నారు.
Click on Image to Read:
Next Story