Telugu Global
Cinema & Entertainment

"ఉడ్తా పంజాబ్" సినిమా రివ్యూ

రేటింగ్ : 3.5/5 జానర్ : క్రైమ్ థ్రిల్లర్ డైరెక్టర్ : అభిషేక్ చౌబే ప్రొడ్యూసర్ : శోభా కపూర్, ఏక్తా కపూర్, అనురాగ్ కశ్యప్ డైలాగ్స్ : సందీప్ శర్మ స్క్రీన్ ప్లే : సందీప్ శర్మ, అభిషేక్ చౌబే నటీనటులు : షాహిద్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, దల్జీత్ దోసాంగ్ తదితరులు సంగీతం : అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రవర్కార్ సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి […]

ఉడ్తా పంజాబ్ సినిమా రివ్యూ
X

రేటింగ్ : 3.5/5
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
డైరెక్టర్ : అభిషేక్ చౌబే
ప్రొడ్యూసర్ : శోభా కపూర్, ఏక్తా కపూర్, అనురాగ్ కశ్యప్
డైలాగ్స్ : సందీప్ శర్మ
స్క్రీన్ ప్లే : సందీప్ శర్మ, అభిషేక్ చౌబే
నటీనటులు : షాహిద్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, దల్జీత్ దోసాంగ్ తదితరులు
సంగీతం : అమిత్ త్రివేది
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రవర్కార్
సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి
విడుదల : జూన్ 17, 2016

డ్రగ్స్ ప్రపంచం మొత్తం లో ఉన్న సమస్య… మాఫియా లాగా ఇదీ యూనివర్సల్ సబ్జెక్ట్ కానీ అనుకున్నట్టు గా తెరకెక్కించాలంటే లీగల్ గా కూడా సమస్యలని ఎదుర్కోక తప్పదు. నటీనటులతోనూ, టెక్నీషియన్ల తోనూ దర్శకుడు నిరంతరం ప్రతి సీన్ నీ ఒక యుద్దం లా అనుకుని పని చేయాలి.. అదే సాహసం చేసాడు అభిషేక్ చౌబే… పాక్ తరహా ముస్లిం దేశాలనుంచి వచ్చే డ్రగ్స్ మాఫియా మొదటి టార్గెట్ అయిన పంజాబ్ లోని చీకటి కోణాల మీద సెర్చ్ లైట్ వేసాడు… అనుకున్నట్టే సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు… చిట్ట చివరికి థియేటర్ లోకి వచ్చింది “ఉడ్తా పంజాబ్”…

కథ ఏంటి?
నలుగురు మనుషులూ… నాలుగు కథలూ కలిస్తే “ఉడ్తా పంజాబ్”. నిజానికి ఒకరికీ ఒకరికీ ఏ సంబందమూ లేదు… ఎవరికి వారుగా ఉన్న వీళ్ళ జీవితాలలో చోటు చేసుకున్న సంఘటనలే ఈ సినిమా… పంజాబ్ యూత్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న పాప్ సింగర్ టామీ(షాహిద్ కపూర్) డ్రగ్స్ కి బానిస అయిపోతాడు. చివరికి ఆ మత్తులో ఉంటే తప్ప పాట పాడ లేని స్థితికి చేరుకుంటాడు. ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన పింకీ (ఆలియా భట్), అనుకోని పరిస్థితుల్లో బీహార్ నుంచి పంజాబ్ కు కూలీగా వలసవెళ్లి మాదకద్రవ్యాల వలలో పడిపోతుంది. డ్రగ్స్ మాఫియా నుంచి లంచాలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ సర్తాజ్(దిల్జిత్).. చివరికి ఆ డ్రగ్స్ వల్లే తన సోదరుణ్ణి కోల్పోతాడు. డాక్టర్ ప్రీత్ (కరీనా కపూర్) డ్రగ్స్ బారినపడి సర్వం కోల్పోయి రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో చేరిన వారికి సపర్యలు చేస్తూ, మాదకద్రవ్యాల సరఫరాపై తనదైన శైలిలో పోరాడుతుంది. వీరి జీవితాల్లోని ప్రతి అంకం డ్రగ్స్ తో ముడిపడి ఉన్నదే. డ్రగ్స్ మత్తులో చిక్కుకున్న టామీ సింగ్, అదే మాదకద్రవ్యాల కారణంగా చిక్కుల్లో పడ్డ పింకీ తమని తాము ఉన్న పరిస్తితుల్లోంచి బయట పడేసుకుంటారా? సర్తాజ్ లాంటి అవినీతి పోలీస్ ఆఫీసర్ తన లాంటి వారి వల్ల ఈ దేశం ఎంత నష్ట పోయిందీ అన్న విషయాన్ని గ్రహించాడా? మాదక ద్రవ్యాల వలలో ఉన్న అమాయకులని రక్షించాలన్న డాక్టర్ ప్రీత్ ప్రయత్నం ఎంత వరకూ ఫలించిందీ…. అన్న విషయాలు తెలియాలీ అంటే సినిమా చూడాల్సిందే…

ఎలా తీశారు?
మాఫియా, డ్రగ్స్, యుద్దం… ఇలాంటి సినిమాలకి ప్రాణం రియలిస్టిక్ గా ఉండే వాతావరణం. ఏమాత్రం సినిమాటిక్ గా అనిపించకూడాదు. ప్రతీ పాత్రా అసలైన‌ వ్యక్తేమో అన్నంత గా లీనమైపోవాలి… ఒక్క మాటలో రెగ్యులర్ మూవీ లా ఉండకూడదు. తాను చూసిన మిగతా సినిమాలకూ ఈ సినిమాకూ ఉన్న తేడా 10 నిమిషాల లోపే ప్రేక్షకుడికి అర్థమైపోవాలి… ఖచ్చితంగా అక్కడే కాన్సంట్రేట్ చేసాడు దర్శకుడుఅభిషేక్ చౌబే. సుదీప్ శర్మ రాసిన స్క్రిప్ట్ కి ఏమాత్రం తగ్గకుండా తన ఊహల్లోని మనుషులనూ… సంఘటనలనూ తెర మీదికి దింపాడు. ‘ఉడ్తా పంజాబ్’ రెగ్యులర్ మూవీ కాదనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమా మొత్తాన్ని డాక్యుమెంటరీలా తీశాడు. అయితే ఎంచుకున్న విషయం కాంటెంపరరీ సమస్య కావడంతో సీన్లన్నీ రియలిస్టిక్ గా, వాస్తవ ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. వాటి ఎఫెక్ట్ ఎంత ఉందో ఈ సినిమా విషయం లో రేగిన వివాదాలే నిదర్శనం.
ఎలా చేశారు..
నటీనటులు అందరిలోకి ఆలియా భట్ అద్భుతంగా నటించింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పింకీ పాత్రలో ఆమె నటనను మెచ్చుకోనివారుండరు. రాక్ స్టార్ గా, డ్రగ్స్ బానిసగా షాహిద్ సైతం అదరగొట్టినా ఎక్కువ మార్కులు పడేది ఆలియాకే. దల్జిత్, కరీనాలు పాత్రల్లో జీవించారు. సబ్ టైటిల్స్ లేకపోతే సినిమా సగం పంజాబీ లోనే నడుస్తున్నట్టుగా ఉంటుంది. మన దేశం లో నిజంగానే ఫ్యామిలీతో కలిసి చూడలేం.., మరీ ఎక్కువ బూతులతో ఉన్న డైలాగులవల్ల… అయితే నిజానికి మన సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు అవన్నీ అక్కడ మరీ బూతుల్లా అనిపించవు… నిజంగా ఒక డ్రగ్ ఎడిక్ట్ అలా కాకుంటే ఎలా మాట్లాడతాడు? అలాంటి ప్రాంతాలను ఇంకెలా చూపిస్తాం? ఆ విషయం అర్థమైతే సెన్సార్ బోర్డు చర్య ఎంత మాత్రమూ సబబు అనిపించదు… మొత్తానికి ఉడ్తా పంజాబ్ నిజంగానే ఒక ఆజాద్ పంచీ ఆశని గురించి చెప్పే కథ…. యూనిట్ మొత్తం మరో అద్బుతాన్ని మనకిచ్చారనే అనుకోవాలి…
విశ్లేష‌ణ‌
ఈ యేడాది లో ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన చిత్రాల్లో ఉడ్తా పంజాబ్ చిత్రం బాగా వివాదం అయిన చిత్రం. పంజాబ్ ప్ర‌భుత్వం సినిమా లో సెన్సార్ బోర్డ్ చూపించిన 89 క‌ట్స్ చేయాల్సిందే న‌ని ప‌ట్టు ప‌ట్ట‌డంతో దేశ వ్యాప్తంగా ఈచిత్రం మీద రాజ‌కీయంగా.. కళాకారుల ప‌రంగా భిన్న‌మైన స్వ‌రాలు వినిపించాయి. దీంతో సినిమా పై దేశ వ్యాప్తంగా ఆడియ‌న్స్ లో ఆస‌క్తి క‌లిగింది. ఒక వాస్త‌వ స‌మ‌స్య‌ను క‌మ‌ర్ష‌యిల్ ఎలిమెంట్స్ ఏమిలేకుండా… ఒక డాక్యూమెంట‌రి రూపంలో చేయ‌డం అనేది సాహ‌సం అనే చెప్పాలి. అలియ భ‌ట్ త‌న పాత్ర‌లో జీవించింది. వాస్త‌వంగా ఉడ్తా పంజాబ్ ఒక చిత్రం కాదు.. ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ తీవ్ర‌త‌ను గుర్తించి .. మొద్దు నిద్ర వ‌ద‌లి …స‌మ‌స్య ను నియంత్రించ‌డానికి మేల్కొలుపు లాంటిది. సినిమా ప్రేమికులు త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం.

First Published:  18 Jun 2016 7:31 AM IST
Next Story