తెలంగాణలోనూ రిజర్వేషన్ల నిప్పు రాజేయాలని చినబాబు ఆదేశం
ఏపీ ఇప్పటికే కులాల కురుక్షేత్రంగా తయారైంది. రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీతో కాపులు ఉద్యమం చేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు. కానీ ఆ సమస్యను ఇప్పటివరకు చంద్రబాబు పరిష్కరించలేదు. పైగా మొన్నటి ఎన్నికల సమయంలో బోయలను ఎస్టీల్లో చేరుస్తామని కూడా చంద్రబాబు మానిఫెస్టోలో హామీ ఇచ్చారు. అనేక బీసీ కులాలను ఏ, బీ, సీ, డీ కేటగిరిల్లో అటు ఇటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి […]
ఏపీ ఇప్పటికే కులాల కురుక్షేత్రంగా తయారైంది. రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీతో కాపులు ఉద్యమం చేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు. కానీ ఆ సమస్యను ఇప్పటివరకు చంద్రబాబు పరిష్కరించలేదు. పైగా మొన్నటి ఎన్నికల సమయంలో బోయలను ఎస్టీల్లో చేరుస్తామని కూడా చంద్రబాబు మానిఫెస్టోలో హామీ ఇచ్చారు. అనేక బీసీ కులాలను ఏ, బీ, సీ, డీ కేటగిరిల్లో అటు ఇటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసింది లేదు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు కులాల ప్రతిపాదికన ఇచ్చిన హామీలే ఇప్పుడు ఏపీలో కులాల కుంపట్లను రాజేస్తున్నాయి. ఈనేపథ్యంలో శనివారం తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన నారా లోకేష్ ఆ ప్రాంత నేతలకు చేసిన సూచన కాస్త ఆశ్చర్యంగానే ఉంది. తండ్రి పాలిస్తున్న రాష్ట్రం కులాలు, రిజర్వేషన్ల ఉద్యమంతో షేక్ అవుతుంటే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎందుకు కామ్‌గా ఉండాలనుకున్నారో ఏమో గానీ తెలంగాణలో మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని పార్టీ నేతలకు చినబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అనుకూల మీడియా సంస్థే ప్రముఖంగా వెల్లడించింది. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు …. కానీ ఆ పని సొంత రాష్ట్రంలో చేసి పక్క రాష్ట్రాలకు నీతులు చెబితే బాగుంటుంది కదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. సొంత రాష్ట్రంలో రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీలని నేరవేర్చని నారా వారు ఇలా పక్క రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని పార్టీ నేతలకు చెప్పడం రెండు కళ్ల సిద్ధాంతంలో ఇదో చాప్టర్ కావచ్చు.
Click on Image to Read: