దిగ్విజయ్ అంతకు దిగజారారా?
తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్న ప్రతిపక్షాలపై నిజామాబాద్ ఎంపీ కవిత ఎదురుదాడికి దిగారు. ఏకంగా దిగ్విజయ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. తెలంగాణ ప్రభుత్వం సాగిస్తోన్న ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులైన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కారెక్కేందుకు వరుసలు కడుతుంటే.. పీసీసీ నేతలు విమర్శల వాడి పెంచారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు మల్లురవి, భట్టి విక్రమార్క లాంటి సీనియర్లు సైతం […]
BY sarvi18 Jun 2016 5:50 AM IST
X
sarvi Updated On: 18 Jun 2016 7:26 AM IST
తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్న ప్రతిపక్షాలపై నిజామాబాద్ ఎంపీ కవిత ఎదురుదాడికి దిగారు. ఏకంగా దిగ్విజయ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. తెలంగాణ ప్రభుత్వం సాగిస్తోన్న ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులైన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కారెక్కేందుకు వరుసలు కడుతుంటే.. పీసీసీ నేతలు విమర్శల వాడి పెంచారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు మల్లురవి, భట్టి విక్రమార్క లాంటి సీనియర్లు సైతం గులాబీదండుపై మాటల యుద్ధం ప్రకటించారు. వీటిని తిప్పికొట్టే క్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ ఏకంగా ఏపీ నేతలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. మా ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులు చూడలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ సీఎం చేస్తోన్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే కాంగ్రెస్ నేతలు ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్ రావులు పార్టీలో చేరారన్నారు. ఎప్పుడు, ఏ పార్టీ నాయకుడు వచ్చినా ఆహ్వానిస్తామని కుండబద్దలు కొట్టారు. అంటే ఆపరేషన్ ఆకర్ష్ ఇపట్లో ఆగేలా లేదని కవిత పరోక్షంగా స్పష్టం చేశారు. కమీషన్లకు, కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడే నాయకులు మా పార్టీలో లేరని తెలిపారు. ఏపీ వ్యవహారాల దిగ్విజయ్ ప్రభుత్వంపై అక్కసుతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన ఆంధ్రా నేతలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. అంతేనా… పనిలోపనిగా కవిత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపైనా విరుచుకుపడ్డారు. తప్పుడు లెక్కలతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని చూశారని దుయ్యబట్టారు. ఏపీకి ఇచ్చిన సాయంలో తెలంగాణ కేంద్రం ఇచ్చిన సాయం చాలా తక్కువని, దమ్ముంటే దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.
కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. పొరుగు రాష్ట్రం నేతలకు అమ్ముడుపోవాల్సిన అవసరం దిగ్విజయ్ సింగ్ కు లేదని స్పష్టం చేశారు. ఆయన మరీ అంతకు దిగజారలేదని అన్నారు. దిగ్విజయ్ సింగ్‌పై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story