గోనె ప్రకాశ్ రావు రీఎంట్రీ
గోనె ప్రకాశ్‌రావు తన వాగ్ధాటితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత. అయితే చాలాకాలంగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. 2014కు ముందు శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలతో ఆయన సైలెంట్ అయిపోయారు. 1983లో మేనకాగాంధీకి చెందిన సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీ చేసి పెద్దపల్లి నుంచి గోనె ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్దికాలం తర్వాత తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. వైఎస్ హయాంలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆర్టీసీ […]
గోనె ప్రకాశ్‌రావు తన వాగ్ధాటితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత. అయితే చాలాకాలంగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. 2014కు ముందు శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలతో ఆయన సైలెంట్ అయిపోయారు. 1983లో మేనకాగాంధీకి చెందిన సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీ చేసి పెద్దపల్లి నుంచి గోనె ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్దికాలం తర్వాత తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.
వైఎస్ హయాంలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆర్టీసీ చైర్మన్‌గానూ చేశారు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. జగన్ పక్షాన గట్టిగానే మాట్లాడేవారు. పొలిటికల్ సబ్జెట్ మీద మంచి గ్రిప్ ఉన్న గోనె ప్రకాశ్‌రావు తేదీలతో సహా రాజకీయ సంఘటలను ప్రస్తావించి ఎదుటివారిని హడలెత్తించేవారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పెద్దపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ రాష్ట్ర విభజన కారణంగా పరిణామాలు మారిపోవడంతో వెనక్కు తగ్గారు. అనంతరం అమెరికా వెళ్లిపోయారు.
ఇప్పుడు తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యేందుకు గోనె సిద్దమయ్యారట. జగన్ పట్ల సానుకూలత ఉన్నా ప్రస్తుత తెలంగాణరాజకీయాల్లో టీఆర్ఎస్ ను ఎదురించేందుకు కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారట. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఒంటెద్దుపోకడలతో తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్న భావనకు వచ్చిన ఆయన… త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ విధానాలను ఎండగట్టాలంటే గోనె లాంటి వారి అవసరం చాలా ఉందని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. తొలి నుంచి కూడా టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై గోనె ప్రకాశ్‌రావు ఒంటికాలితో లేచేవారు. మొత్తం మీద తెలుగు రాజకీయాల్లో మరో వాగ్దాటిని ఇకపై తరచూ చూడవచ్చన్న మాట.
Click on Image to Read: