డిప్యుటీ తహసీల్దార్ హోదా...యాభై రూపాయిల లంచం...మూడేళ్ల జైలు!
తమిళనాడుకి చెందిన ఒక రిటైర్డు డిప్యుటీ తహసీల్దార్‌కు ప్రత్యేక కోర్టు యాభై రూపాయిల లంచం పుచ్చుకున్న నేరానికి మూడేళ్ల జైలు శిక్షని విధించింది. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన విజయలక్ష్మి అనే ఈ మాజీ అధికారిణి ఉద్యోగంలో ఉండగా కుల ధృవీకరణ సర్టిఫికేటుని ఇచ్చేందుకు రూ. 50 లంచం పుచ్చుకుంది. ఈ నేరం రుజువు కావటంతో కోర్టు శిక్షని విధించింది. శుక్రవారం వెలువడిన తీర్పులో న్యాయమూర్తి ఆమెకు జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా సైతం […]
తమిళనాడుకి చెందిన ఒక రిటైర్డు డిప్యుటీ తహసీల్దార్‌కు ప్రత్యేక కోర్టు యాభై రూపాయిల లంచం పుచ్చుకున్న నేరానికి మూడేళ్ల జైలు శిక్షని విధించింది. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన విజయలక్ష్మి అనే ఈ మాజీ అధికారిణి ఉద్యోగంలో ఉండగా కుల ధృవీకరణ సర్టిఫికేటుని ఇచ్చేందుకు రూ. 50 లంచం పుచ్చుకుంది. ఈ నేరం రుజువు కావటంతో కోర్టు శిక్షని విధించింది. శుక్రవారం వెలువడిన తీర్పులో న్యాయమూర్తి ఆమెకు జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా సైతం విధించారు.
Click on Image to Read: