లోకేష్ కోసం సులబ్ కాంప్లెక్స్ లో చేర్చాలా?
రాష్ట్రంలో జనాభా తగ్గుతోంది ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ చంద్రబాబు పదేపదే పిలుపునిస్తుండడంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజల స్థితిగతులను పాతానికి తీసుకెళ్తూ తిరిగి పిల్లలను కనండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కన్యాశుల్కంలో గిరీశంలాగా చంద్రబాబు తయారయ్యాడని… ఎప్పుడు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు వింటే పేదల పిల్లలంతా సులబ్ కాంప్లెక్స్‌లోనో, కూలీలుగానో బతకాల్సి ఉంటుందన్నారు. బుల్లెట్‌లా దూసుకెళ్తా అని […]
రాష్ట్రంలో జనాభా తగ్గుతోంది ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ చంద్రబాబు పదేపదే పిలుపునిస్తుండడంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజల స్థితిగతులను పాతానికి తీసుకెళ్తూ తిరిగి పిల్లలను కనండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కన్యాశుల్కంలో గిరీశంలాగా చంద్రబాబు తయారయ్యాడని… ఎప్పుడు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు వింటే పేదల పిల్లలంతా సులబ్ కాంప్లెక్స్‌లోనో, కూలీలుగానో బతకాల్సి ఉంటుందన్నారు. బుల్లెట్‌లా దూసుకెళ్తా అని చెప్పే చంద్రబాబు నిత్యవసరాల ధరలను మాత్రం బుల్లెట్ వేగంతో పైకి తీసుకెళ్తున్నారని భూమన మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం చేస్తున్న మోసాల గురించి రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తెలిసిపోయిందన్నారు. అందుకే కొత్త ఓటర్లను తయారు చేసి వారిని నమ్మించి లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చనే కుట్ర బుద్దితోనే జనాభా పెంచండి అన్న పిలుపును చంద్రబాబు ఇస్తున్నారని భూమన ఆరోపించారు.
ఫిరాయింపులు అనైతికమని చెప్పిన వెంకయ్యనాయుడు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని వెంటనే సమీక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఫిరాయింపు నిరోధక చట్టంలోని మార్పులు తీసుకువచ్చేందుకు పార్లమెంట్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందన్నారు. అంతేకాదు శ్రీరంగనీతుల తరహాలో మాటలతో ఉపయోగం ఉండదన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి ఎన్ చినరాజప్ప వ్యవహార శైలిపై భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్కు తక్కువ అని ఎద్దేవా చేశారు. హోంమంత్రి పదవిని దిగజార్చారంటూ చంద్రబాబుపై భూమన నిప్పులు చెరిగారు. గోదావరి జిల్లాల్లో యుద్ధ వాతావరణం ఉందన్నారు.
Click on Image to Read: