ఆరురోజులు అమెరికాలో ఉన్నాడు...నాలుగుకోట్లు ఖర్చయింది!
అధికారంలో ఉన్న రాజకీయ నేతలు విదేశాలకు వెళ్లినపుడు ప్రజలకు ఒరిగే మేలు ఏమిటో…ప్రత్యక్షంగా మన కళ్లముందు కనబడదు కానీ, ఆ సమయంలో వారికోసం ఖర్చుపెట్టే కోట్ల లెక్కలు మాత్రం స్పష్టంగా కనబడుతుంటాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యేందుకు ఆరు రోజుల పాటు న్యూయార్క్లో ఉన్నాడు. సచార్ బెన్ మీర్ అనే న్యాయవాది ఆర్‌టిఐ చట్టం ద్వారా ఆ ఆరు రోజులు నేతన్యాహూకి అయిన ఖర్చుల వివరాలు సేకరించాడు. అందులో ఆరురోజులకు ప్రధాని […]
అధికారంలో ఉన్న రాజకీయ నేతలు విదేశాలకు వెళ్లినపుడు ప్రజలకు ఒరిగే మేలు ఏమిటో…ప్రత్యక్షంగా మన కళ్లముందు కనబడదు కానీ, ఆ సమయంలో వారికోసం ఖర్చుపెట్టే కోట్ల లెక్కలు మాత్రం స్పష్టంగా కనబడుతుంటాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యేందుకు ఆరు రోజుల పాటు న్యూయార్క్లో ఉన్నాడు. సచార్ బెన్ మీర్ అనే న్యాయవాది ఆర్‌టిఐ చట్టం ద్వారా ఆ ఆరు రోజులు నేతన్యాహూకి అయిన ఖర్చుల వివరాలు సేకరించాడు. అందులో ఆరురోజులకు ప్రధాని హెయిర్ కటింగ్ కోసం అక్షరాలా లక్ష రూపాయిలు ఖర్చుచేసినట్టుగా ఉంది. బట్టల ఇస్త్రీకి రూ.15వేలు, భోజనం కోసం రూ. 1.25 లక్షలు, ఫర్నిచర్కోసం రూ.13 లక్షలు వెచ్చించారు. మొత్తం ఆరురోజుల పర్యటన తాలూకూ ఖర్చుని నాలుగుకోట్లుగా చూపించారు. ప్రధాని కార్యాలయం, విదేశాంగశాఖ ఈ వివరాలను అందించాయి. నేతన్యాహూ, ఆయన భార్య సారా విలాసాలకోసం భారీగా ఖర్చుపెడుతున్నారని, ప్రజల సొమ్ముని, అంటే తన సొమ్ముని, ఎలా ఖర్చుపెడుతున్నారో తెలుసుకునే హక్కు తనకుందని ఆ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించేందుకు ప్రధాని ప్రతినిధి నిరాకరించారు.