అ..ఆ సినిమా నుంచి రెడ్డి పేర్లు తొలగింపు
ఇటీవల విడుదలైన అ..ఆ సినిమాలో షకలక శంకర్ చేత ఒక దొంగ పాత్ర చేయించారు. దానికి అవసరంలేకపోయినా ప్రతాప్‌రెడ్డి అనే పేరు పెట్టారు. వాళ్ల నాన్నపేరు బంజారాహిల్స్ బాల్‌రెడ్డి అనే పేరు పెట్టారు. ఈ పాత్ర రెండు సన్నివేశాల్లో కనిపిస్తుంది. రెడ్డి కులాన్ని అవమానించడానికే పెట్టారా అన్నట్లు ఆ పాత్ర, ఆ సన్నివేశం ఉన్నాయని తెలుగు రాష్ట్రాలలోని అనేకమంది రెడ్లు తమ నిరసనను ఫేస్‌బుక్‌ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా తెలియజేశారు. మరికొంతమంది ఇంకొంత కోపంతో డైరెక్టర్ త్రివిక్రం […]
ఇటీవల విడుదలైన అ..ఆ సినిమాలో షకలక శంకర్ చేత ఒక దొంగ పాత్ర చేయించారు. దానికి అవసరంలేకపోయినా ప్రతాప్‌రెడ్డి అనే పేరు పెట్టారు. వాళ్ల నాన్నపేరు బంజారాహిల్స్ బాల్‌రెడ్డి అనే పేరు పెట్టారు. ఈ పాత్ర రెండు సన్నివేశాల్లో కనిపిస్తుంది. రెడ్డి కులాన్ని అవమానించడానికే పెట్టారా అన్నట్లు ఆ పాత్ర, ఆ సన్నివేశం ఉన్నాయని తెలుగు రాష్ట్రాలలోని అనేకమంది రెడ్లు తమ నిరసనను ఫేస్‌బుక్‌ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా తెలియజేశారు. మరికొంతమంది ఇంకొంత కోపంతో డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ పై బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. పనిలో పనిగా ఇటీవల వస్తున్న అనేక తెలుగు సినిమాల్లో రెడ్లను ఏవిధంగా కించపరుస్తున్నది వివరంగా రాస్తూ, దాని వెనక ఒక సామాజిక వర్గం వున్నదని పేర్కొంటూ ఆ సామాజిక వర్గాన్ని నీచంగా తిడుతూ అనేకమంది సోషల్‌మీడియాలో ధ్వజమెత్తారు.
అలాగే రెడ్డి జనసంఘం వారు హోంమినిస్టర్‌ను కలిసి సినిమాపై ఫిర్యాదు చేశారు. ఆ సన్నివేశాలు తొలగించకుంటే అ..ఆ సినిమా ఆడుతున్న ధియేటర్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తామని హెచ్చరించారు.
వీటికి స్పందించిన అ..ఆ చిత్ర యూనిట్ రెడ్డి ప్రస్తావన వున్న సంభాషణలను తొలగించారు.
Click on Image to Read: