భుజాలు తడుముకున్న చంద్రబాబు అనుచరులు!
గుమ్మడికాయ దొంగలెవరు ? అంటే భుజాలు తడుముకున్నాడట! వెనకటికి ఒకడు. సరిగ్గా ఇలాగే ఉంది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనుచరుల తీరు. ఇటీవల తమ ప్రభుత్వాన్ని కూలదోసి.. రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు – కాంగ్రెస్ కుట్రపన్నాయని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిఘా అధికారులు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఈ విషయంలో తనను వెంటనే అప్రమత్తం చేశారని వెల్లడించడంతో తెలంగాణవాదులంతా కాంగ్రెస్- టీడీపీపై మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని […]
BY sarvi16 Jun 2016 10:08 PM GMT
X
sarvi Updated On: 17 Jun 2016 1:54 AM GMT
గుమ్మడికాయ దొంగలెవరు ? అంటే భుజాలు తడుముకున్నాడట! వెనకటికి ఒకడు. సరిగ్గా ఇలాగే ఉంది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనుచరుల తీరు. ఇటీవల తమ ప్రభుత్వాన్ని కూలదోసి.. రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు – కాంగ్రెస్ కుట్రపన్నాయని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిఘా అధికారులు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఈ విషయంలో తనను వెంటనే అప్రమత్తం చేశారని వెల్లడించడంతో తెలంగాణవాదులంతా కాంగ్రెస్- టీడీపీపై మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు డబ్బు ఎర చూపుతూ.. చంద్రబాబు అనుంగు అనుచరుడు రేవంత్ రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే! అదే సమయంలో చంద్రబాబు ఆడియో టేపులు కూడా మీడియా చేతికి చిక్కడంతో టీడీపీ పరువు గంగలో కలిసింది. ఓటుకునోటు కేసుతో చంద్రబాబు పార్టీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తానికి ఓటుకునోటు కేసులో నిందితులే ఇంకా ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.
ఇంతకీ టీడీపీ ఏమందో తెలుసా?
కేసీఆర్ ఆరోపణలపై ఓటుకు నోటు కేసు ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. తమ పార్టీ కొన్నిసార్లు గెలిచింది.. ఓడింది. అంతే తప్ప ఏ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించిన చరిత్ర తమకు లేదని సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఈ విషయంలో ఎంఐఎం అధినేత ఒవైసీ కేసీఆర్ వ్యాఖ్యలపై నోరువిప్పాలని డిమాండ్ చేశారు. అయితే, రేవంత్ రెడ్డి ఆరోపణలకు గులాబీనేతలు కూడా అదే రీతిన స్పందిస్తున్నారు. ప్రభుత్వాలు కూలగొట్టడం తెలుగుదేశానికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శిస్తున్నారు.
వారు సంధిస్తోన్న ప్రశ్నలు ఇవే!
1. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్పట్లో నాదెండ్ల భాస్కర్ రావు కూలగొట్టిన సంగతి మరిచిపోయారా?
2. మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 1994లోఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా గెలిచిన ఎన్టీఆర్ ను సొంత మామ అన్న కనికరం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి విషయం వాస్తవం కాదా?
3. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఏసీబీకి రేవంత్ రెడ్డి దొరికిన మాట వాస్తవం కాదా?
4. లేదా తెలంగాణ ఎమ్మెల్యేలను మభ్యపెడుతూ చంద్రబాబు చేసిన ఫోన్ సంభాషణలు వెలుగుచూడటం వాస్తవం కాదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
గురివింద నీతులు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలని హితవుపలికారు. టీడీపీ నేతలు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
Next Story