గంటా ఆ మాటలు వెనక్కు తీసుకో... ముద్రగడకు ఏమైనా జరిగితే...
ముద్రగడ దీక్ష పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును, మంత్రులుచేస్తున్న వ్యాఖ్యలను వైసీపీనేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నా ముద్రగడ పరిస్థితి నార్మల్‌గానే ఉందని, ఆయన దీక్షపై అనుమానాలున్నాయంటూ మంత్రి గంటా చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ఒక ఉద్యమనాయకుడి పట్ల ఇలా అవహేళనగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముద్రగడకు ఏమైనా జరిగితే ఈ వర్గం చంద్రబాబును క్షమించదన్నారు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి కులాల […]
ముద్రగడ దీక్ష పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును, మంత్రులుచేస్తున్న వ్యాఖ్యలను వైసీపీనేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నా ముద్రగడ పరిస్థితి నార్మల్‌గానే ఉందని, ఆయన దీక్షపై అనుమానాలున్నాయంటూ మంత్రి గంటా చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ఒక ఉద్యమనాయకుడి పట్ల ఇలా అవహేళనగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముద్రగడకు ఏమైనా జరిగితే ఈ వర్గం చంద్రబాబును క్షమించదన్నారు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఇలా కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే తీరును చంద్రబాబు మానుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి చినరాజప్ప అవసరమైతే ముద్రగడను అరెస్ట్ చేస్తామంటున్నారని వీరంతా తెలిసే మాట్లాడుతున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
అరెస్ట్ సందర్భంగా ముద్రగడతో పాటు ఆయన కుటుంబంలోని మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాన్ని పాలించాల్సిన చంద్రబాబు… ఒక రావణ కాష్టంగా మార్చి… పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారని బొత్స విమర్శించారు. ముద్రగడ కుటుంబసభ్యుల పట్ల దారుణంగా ఎందుకు ప్రవర్తించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
Click on Image to Read: