కొత్తరకం బ్లాక్‌మెయిల్‌కు దిగిన అమర్‌నాథ్ రెడ్డి
టీడీపీలోకి ఫిరాయించిన అమర్‌నాథ్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టుగా ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యక్తిత్వంపై తీవ్రస్థాయిలో దాడి జరుగుతున్న నేపథ్యంలో అమర్‌నాథ్ రెడ్డి వైసీపీకి ఎదురు హెచ్చరికలు చేశారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వేళ… తన వ్యక్తిత్వాన్ని కించపరిస్తే బాగుండదని హెచ్చరించారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే తాను కూడా నోరు విప్పుతా అని బెదిరించారు. తాను 30 కోట్లకు అమ్ముడుపోలేదని అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. జగన్‌కు ధైర్యం ఉంటే తాను […]
టీడీపీలోకి ఫిరాయించిన అమర్‌నాథ్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టుగా ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యక్తిత్వంపై తీవ్రస్థాయిలో దాడి జరుగుతున్న నేపథ్యంలో అమర్‌నాథ్ రెడ్డి వైసీపీకి ఎదురు హెచ్చరికలు చేశారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వేళ… తన వ్యక్తిత్వాన్ని కించపరిస్తే బాగుండదని హెచ్చరించారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే తాను కూడా నోరు విప్పుతా అని బెదిరించారు.
తాను 30 కోట్లకు అమ్ముడుపోలేదని అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. జగన్‌కు ధైర్యం ఉంటే తాను డబ్బులు తీసుకున్నట్టు దేవుడి ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. జగన్ అలా ప్రమాణం చేస్తే తానూ చేసేందుకు సిద్ధమన్నారు. మేము రాజీనామా చేసి ఓడిపోతే జగన్ తన పార్టీని మూసివేస్తారేమో చెప్పాలని భూమా నాగిరెడ్డి డైలాగులనే అమర్‌నాథ్‌రెడ్డి కూడా ఆశ్రయించారు.
అయినా ఫిరాయింపుదారుల తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తోంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి ఫిరాయించిన ఎమ్మెల్యేలు… రాజీనామా చేయకుండా ఎదురు సవాల్ విసరడం బట్టి ఏపీ రాజకీయాల్లో బరితెగింపు వ్యవహారం పరాకాష్టకు చేరినట్టుగా ఉంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా సరే చట్టంపై గౌరవం, తమకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే పదవులకు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలే గానీ ఇలా వితండవాదానికి దిగడం ఆశ్చర్యమే. చంద్రబాబుకు దూరమైన తర్వాత తనకు ఆయన విలువ తెలిసిందని అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు.
Click on Image to Read: