నన్ను ఓడించేందుకు ఇందిరమ్మను తెచ్చారు... ఎన్టీఆర్‌ది నాది ఒకటే అని ప్రచారం చేశారు
వెంకయ్యనాయుడు నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా విజయవాడలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి చంద్రబాబు, కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి, రాయపాటి, దేవినేని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు తనపై కొందరు లేనిపోని కథనాలు రాస్తుంటారని చెప్పారు. మూడుసార్లకు మించి బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉండదని, కాబట్టి చంద్రబాబు సాయంతో టీడీపీ నుంచి వెంకయ్య రాజ్యసభకు వెళ్తారంటూ కొందరు కథనాలు రాశారని చెప్పారు. తాను మరీ అంత అమాయకుడిలా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. […]
వెంకయ్యనాయుడు నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా విజయవాడలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి చంద్రబాబు, కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి, రాయపాటి, దేవినేని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు తనపై కొందరు లేనిపోని కథనాలు రాస్తుంటారని చెప్పారు. మూడుసార్లకు మించి బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉండదని, కాబట్టి చంద్రబాబు సాయంతో టీడీపీ నుంచి వెంకయ్య రాజ్యసభకు వెళ్తారంటూ కొందరు కథనాలు రాశారని చెప్పారు. తాను మరీ అంత అమాయకుడిలా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు.
వెంకయ్యనాయుడు ఎప్పుడూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరని ప్రజాబలం లేదని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1978 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పది స్థానాల్లో గెలిస్తే … కాంగ్రెస్‌ను ఎదురించి తానొక్కడినే గెలుపొందానని చెప్పారు. ఆ సమయంలో వెంకయ్యను ఓడించాలంటూ ఇందిరాగాంధీని తీసుకొచ్చారని వెంకయ్యచెప్పారు. 1983లో ఎన్టీఆర్ గాలిలోనూ తట్టుకుని నెల్లూరు నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తానొక్కడినేనని చెప్పారు.
వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలని, కాబట్టి వెంకయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సరికాదంటూ ఒక దశలో ఎన్టీఆర్ వెనక్కు తగ్గారని చెప్పారు. కానీ అలా చేస్తే ఎన్టీఆర్‌తో వెంకయ్య కుమ్మక్కు అయ్యారన్న విమర్శలు వస్తాయని, కాబట్టి ప్రచారం చేసుకుని వెళ్లాలని ఎన్టీఆర్‌ను కోరినట్టు చెప్పారు. ఆ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి డిపాజిట్లు రాలేదని వెంకయ్య చెప్పారు. తాను రాజకీయంగా ఎదిగేందుకు విజయవాడ ఎంతో సాయపడిందన్నారు. చంద్రబాబు లాంటి వారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయకముందు పత్రికలకు, సినిమాలకు, కళలకు, రాజకీయాలకు విజయవాడే కేంద్రంగా ఉండేదన్నారు.
నాదెండ్ల భాస్కరరావు ..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు తాను ఎన్టీఆర్‌కు అండగా నిలబడ్డానని చెప్పారు. బీజేపీకి టీడీపీకి మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా తాను ఎన్టీఆర్ కోసం పనిచేశానని వెల్లడించారు. ఆ సమయంలో ఎన్టీఆర్, వెంకయ్యలది ఒకటే (కులం) కదా అందుకే ఒకరికొకరు మద్దతిచ్చుకుంటున్నారన్న ప్రచారం కూడా జరిగిందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే స్థానికంగానే ఉండాల్సి ఉంటుందని… కానీ పార్టీకి సేవలందించాలన్న ఉద్దేశంతోనే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెంకయ్యనాయుడు చెప్పారు.
Click on Image to Read: