భారీ రేటు పలికిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
చిత్తూరుజిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారు. గురవారం ఆయన టీడీపీలో చేరుతారని సమాచారం. తాను టీడీపీలో చేరుతున్న విషయాన్ని ఎమ్మెల్యే కూడా ధృవీకరించారు. టీడీపీలోకి వెళ్తుంటే సొంతింటికి వెళ్తున్నట్టుగా ఉందన్నారు. ఈయన తండ్రి రామకృష్ణరెడ్డి గతంలో మూడుసార్లు టీడీపీ ఎంపీగా పనిచేశారు. 2014కు ముందు వైసీపీ గాలి వీస్తుండడంతో అమర్‌నాథ్ రెడ్డి టీడీపీని వీడి జగన్ పార్టీలో చేరారు. అప్పట్లో చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి మరీ వైసీపీలో చేరారు. ఇప్పుడు తిరిగి అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరడం వెనుక పెద్ద తతంగమే నడిచిందని […]
చిత్తూరుజిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నారు. గురవారం ఆయన టీడీపీలో చేరుతారని సమాచారం. తాను టీడీపీలో చేరుతున్న విషయాన్ని ఎమ్మెల్యే కూడా ధృవీకరించారు. టీడీపీలోకి వెళ్తుంటే సొంతింటికి వెళ్తున్నట్టుగా ఉందన్నారు. ఈయన తండ్రి రామకృష్ణరెడ్డి గతంలో మూడుసార్లు టీడీపీ ఎంపీగా పనిచేశారు. 2014కు ముందు వైసీపీ గాలి వీస్తుండడంతో అమర్‌నాథ్ రెడ్డి టీడీపీని వీడి జగన్ పార్టీలో చేరారు. అప్పట్లో చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి మరీ వైసీపీలో చేరారు. ఇప్పుడు తిరిగి అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరడం వెనుక పెద్ద తతంగమే నడిచిందని చెబుతున్నారు.
వైసీపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకుండా ఉండేందుకు టీడీపీ .. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు దిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆప్రయత్నంలో భాగంగానే అమర్‌నాథ్ రెడ్డిని కొనేశారని చెబుతున్నారు. అమర్‌నాథ్ రెడ్డిని చంద్రబాబు రూ. 30 కోట్లకు కొనుగోలు చేశారని ఒక ప్రముఖ పత్రిక కథనం. సొంత జిల్లాలోనే టీడీపీ బలహీనంగా ఉండడంతో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఖర్చు ఎక్కువ అయినా అమర్‌నాథ్ రెడ్డిని టీడీపీలోకి తీసుకుంటున్నారట. మంత్రి పదవిపైనా చంద్రబాబు హామీ ఇచ్చారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో వైసీపీ 8 , టీడీపీ 6 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి జంప్ తో జిల్లాలో టీడీపీ, వైసీపీ బలం సమం కానుంది.
Click on Image to Read: