నేను రాజీనామా చేస్తా...నాకీ పదవి ఉండి ఏం లాభం...
పశ్చిమగోదావరి జిల్లాలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ మంత్రి మాణిక్యాలరావు ఏకంగా మంత్రిపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. టీడీపీకి చెందిన జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తనను పదేపదే అవమానిస్తున్నారని మంత్రివాపోయారు. ఈ విషయంపై స్వయంగా సీఎం చంద్రబాబుకు మంత్రి ఫిర్యాదు చేశారు. ‘నాకు ఈ పదవి అక్కర్లేదు. రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. నా నియోజకవర్గంలోనే అవమానపరుస్తున్నారు. ఇంకా నేను ఈ పదవిలో ఉండి ఏం లాభం?. నాకు పదవి ఉన్నా […]
పశ్చిమగోదావరి జిల్లాలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ మంత్రి మాణిక్యాలరావు ఏకంగా మంత్రిపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. టీడీపీకి చెందిన జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తనను పదేపదే అవమానిస్తున్నారని మంత్రివాపోయారు. ఈ విషయంపై స్వయంగా సీఎం చంద్రబాబుకు మంత్రి ఫిర్యాదు చేశారు. ‘నాకు ఈ పదవి అక్కర్లేదు. రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. నా నియోజకవర్గంలోనే అవమానపరుస్తున్నారు. ఇంకా నేను ఈ పదవిలో ఉండి ఏం లాభం?. నాకు పదవి ఉన్నా లేకపోయినా జనం కోసం పనిచేస్తా’ అంటూ మాణిక్యాలరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించి సీఎం కార్యాలయం రంగంలోకి దిగింది.
సీఎంవో కార్యదర్శి సతీష్ చంద్ర మంత్రితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి ఈ విషయంపై చర్చిస్తారని వివరించారు. అయితే సీఎంవో కార్యదర్శి వద్ద కూడా మంత్రి కాస్త గట్టిగానే మాట్లాడారని చెబుతున్నారు. ముళ్లపూడి తనను పదేపదే అవమానిస్తున్న విషయాన్ని సీఎంకు ఇదివరకే వివరించానని మంత్రి చెప్పారు. అయినా ఎలాంటి చర్యలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో ముళ్లపూడి బాపిరాజు నిత్యం జోక్యం చేసుకుంటున్నారని, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలోనూ తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి రాదు… సీఎం అన్ని మాట్లాడుతారు. మీరు విజయవాడకు రండి అని సీఎంవో కార్యదర్శి సతీష్ చెప్పారని సమాచారం.
Click on Image to Read: