మనుషుల హత్య కేసు: 3 సింహాల అరెస్టు!
వినడానికి.. చదవడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం! పైగా ఇది జరిగింది ఎక్కడో విదేశాల్లో కాదు… మనదేశంలోనే! మనుషుల ను చంపాయన్న కేసులో అధికారులు మూడు సింహాలను అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఏమిటంటే… గుజరాత్‌లోని గిర్ అభయారణ్యం సింహాలకు నిలయంగా ఉంది. ఇక్కడ సింహాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నిత్యం వీటిపై నిఘాతోపాటు, ఇక్కడ వేటగాళ్ల సంచారం లేకుండా అటవీశాఖ అధికారులు పహారా, గస్తీ కాస్తుంటారు. గతేడాది గుజరాత్‌లో వచ్చిన వరదల కారణంగా […]
వినడానికి.. చదవడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం! పైగా ఇది జరిగింది ఎక్కడో విదేశాల్లో కాదు… మనదేశంలోనే! మనుషుల ను చంపాయన్న కేసులో అధికారులు మూడు సింహాలను అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఏమిటంటే…
గుజరాత్‌లోని గిర్ అభయారణ్యం సింహాలకు నిలయంగా ఉంది. ఇక్కడ సింహాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నిత్యం వీటిపై నిఘాతోపాటు, ఇక్కడ వేటగాళ్ల సంచారం లేకుండా అటవీశాఖ అధికారులు పహారా, గస్తీ కాస్తుంటారు. గతేడాది గుజరాత్‌లో వచ్చిన వరదల కారణంగా పదుల సంఖ్యలో సింహాలు మృత్యవాతపడ్డాయి. అప్పుడు జంతుప్రేమికులంతా అయ్యో..! అనుకున్నారు. తరువాత ఇటీవల కాలంలో ముగ్గురు మనుషులను అదే ప్రాంతంలో క్రూరమృగాలు వేటాడి తిన్నాయి. దీనిపై అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఆ ముగ్గురిని చంపింది సింహాలని నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలంలో లభించిన సింహాల పాదముద్రలు సేకరించారు. ఇక వాటి కోసం అభయారణ్యంలో వేట మొదలు పెట్టారు. మనుషులను తేలిగ్గా అదుపులోకి తీసుకోవచ్చు. కానీ, ఇవి సింహాలు. వీటిని గుర్తింపునకు అధికారులు నానా కష్టాలు పడ్డారు. మొత్తం 17 సింహాలను బంధించిన అధికారులు సంఘటనా స్థలంలో లభించిన పాదముద్రలు, మలం ఆధారంగా మొత్తం 3 సింహాలు మనిషి మాంసానికి రుచిమరిగినట్లు ఝాడీ అయింది. ఒకసారి మ్యాన్ ఈటర్‌గా మారాక ఇక ఆ జంతువు చాలా ప్రమాదకరం. అడవిలో కనిపించిన ఏ మనిషిని వదలవు. కాబట్టి వాటిని బంధించి వుంచడం శ్రేయస్కరం. వీటిలో ఒకటి మగది కాగా.. రెండు ఆడవి. వీటిలో మగది శారీరకంగా, ఆధిపత్యపరంగా అత్యంత ప్రమాదకరమైనదిగా తేల్చిన అధికారులు దీనిని జూలోగానీ, జంతు సంరక్షణ కేంద్రంలోగానీ ఉంచాలని నిర్ణయించారు. ఇక మిగిలిన వాటిని అడవిలోవదిలేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు ఎవరైనా సమానమే! అన్న విషయం మరోసారి రుజువైంది కదా!