దానం అనుచరుల అంతర్మథనం!
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోకుండానే.. పార్టీలో చేరారు. ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం. అయితే, కండువా కప్పినా.. కప్పుకోకున్నా.. ఆయన ఇప్పుడు అధికారపార్టీ నాయకుడే. ఈ విషయానికి దానం అనుచరుల అంతర్మథనానికి సంబంధమేంటి? అనుకుంటున్నారా? ఆ విషయం పూర్తిగా అర్థం కావాలంటే.. ఒక నాలుగు నెలలు వెనక్కి వెళ్లాలి. కేవలం సీఎం కండువా కప్పడానికి రావడం లేదన్న కారణంతో దానం నాగేందర్ టీఆర్ ఎస్ పార్టీలోకి రాలేదన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. […]
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోకుండానే.. పార్టీలో చేరారు. ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం. అయితే, కండువా కప్పినా.. కప్పుకోకున్నా.. ఆయన ఇప్పుడు అధికారపార్టీ నాయకుడే. ఈ విషయానికి దానం అనుచరుల అంతర్మథనానికి సంబంధమేంటి? అనుకుంటున్నారా? ఆ విషయం పూర్తిగా అర్థం కావాలంటే.. ఒక నాలుగు నెలలు వెనక్కి వెళ్లాలి. కేవలం సీఎం కండువా కప్పడానికి రావడం లేదన్న కారణంతో దానం నాగేందర్ టీఆర్ ఎస్ పార్టీలోకి రాలేదన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. దానం నాగేందర్.. నగరంలో అంగబలం, ఆర్థిక బలం పుష్టిగా ఉన్నమాజీ మంత్రి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశమంతా ఎదురుగాలి వీయడంతో ఆయన కూడా ఓటమి పాలయ్యారు. తరువాత ఆయనతో మంత్రి హరీష్ మంతనాలు జరిపారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల నాటికి ఆయన పార్టీలోకి చేరేందుకు సర్వం సిద్ధమైంది.
సీఎం రానన్నారని..
అయితే, దానం పార్టీ మారేందుకు అంతా రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. అప్పట్లో సీఎం స్వయంగా వచ్చి తన మెడలో కండువా కప్పుతారని దానం భావించారని, అందుకే, భారీ సభ, ప్లెక్సీలతో సహా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని చెబుతారు. చివరి నిమిషంలో కేసీఆర్ కు బదులు ఎంపీ కేశవరావు వస్తాడని తెలుసుకున్న దానం ఆగ్రహించారని సమాచారం. సీఎం వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తేనే.. సభ ఉంటుందని ఆయన స్పష్టం చేశారని, సీఎం రావడం లేదని తెలిసి.. అప్పటికప్పుడు పార్టీ చేరికపై తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తీరా ఇప్పుడేమో గుత్తా కండువా కప్పుకోకుండా కారెక్కారు. దీనిపై ఇప్పుడు మాజీమంత్రి దానం అనుచరులు మదనపడుతున్నారట. కండువా ఎవరు కప్పితేనేం..? అసలు కప్పుకోకుంటే ఏం? అప్పుడే అధికారపార్టీలో చేరి ఉంటే.. ఇప్పటికే తమ నాయకుడు ఏదో ఒక పదవిలో తప్పకుండా కొనసాగేవారని, దానం అనుచరులు బాధ పడుతున్నారు.
Click on Image to Read: