Telugu Global
International

"ఆటా" సిల్వర్ జూబ్లీ వేడుకలకు గ్రాండ్‌గా ఏర్పాట్లు

అమెరికాలోని తెలుగువారికి అన్నింట అండగా నిలుస్తూ విజయవంతంగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ ”ఆటా” సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్దమవుతోంది. జులై 1 నుంచి జులై 3 వరకు చికాగో వేదికగా ఆట ఉత్సవాలు జరగనున్నాయి. ఆటా దిగ్విజయంగా 25ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటా ఫెస్టివల్‌కు అమెరికాలోని దాదాపు 10వేల మంది తెలుగువారు హాజరవుతారని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వివిధ […]

ఆటా సిల్వర్ జూబ్లీ వేడుకలకు గ్రాండ్‌గా ఏర్పాట్లు
X

అమెరికాలోని తెలుగువారికి అన్నింట అండగా నిలుస్తూ విజయవంతంగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ ”ఆటా” సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్దమవుతోంది. జులై 1 నుంచి జులై 3 వరకు చికాగో వేదికగా ఆట ఉత్సవాలు జరగనున్నాయి. ఆటా దిగ్విజయంగా 25ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆటా ఫెస్టివల్‌కు అమెరికాలోని దాదాపు 10వేల మంది తెలుగువారు హాజరవుతారని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు ఈ ఏడాది ఆటా ఉత్సవాలకు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన రాజకీయనాయకులు, సినీ తారలు రానున్నారు. ఆటా సిల్వర్ జూబ్లి సందర్భంగా వివిధరంగాల తెలుగు ప్రముఖులను ఆటా సన్మానించనుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు https://www.ataconference.org ద్వారా తెలుసుకోవచ్చు.

First Published:  16 Jun 2016 7:34 AM IST
Next Story